ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ఉపాధ్యాయ నిరుద్యోగులు గత ఆరేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.. అదిగో డీఎస్సి ఇదిగో డీఎస్సిఅంటూ నాయకులు చెప్పిన మాటలు మాటలు గానే మిగిలి పోతున్నాయి.. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క కొత్త టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు.. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం లో భాగంగా ముఖ్య మంత్రి చంద్ర బాబు 16,347 టీచర్ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని మొదటి సంతకం పెట్టారు.. మొదటి సంతకం పెట్టి 10 నెలలు అవుతున్న నోటిఫికేషన్ మాత్రం రాలేదు.. దీనితో అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ ఆందోళనకు దిగారు..

ఎప్పుడో రావాల్సిన నోటిఫికేషన్ కు ఎస్సి వర్గీకరణతో ముడి పెట్టడంతో ఇంత ఆలస్యం అయింది..తాజాగా ఎస్సి వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆర్డినేన్స్ జారీ చేసేందుకు కాబినేట్ ఆమోధించింది.. మరో రెండు రోజుల్లో ఆర్డినేన్స్ వస్తుంది అని ఆ వెంటనే డీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి సాధ్యమైనంత త్వరగానే పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 2,260 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ  ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ నియామాకాలను సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dsc