
ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. భారత్తో గొడవ పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు సింధూ నది జలాలు పోయాయి. దాంతో సగం పాకిస్తాన్ గొంతు ఎండిపోతుంది. మరోవైపు పాకిస్థానీ అన్ని విధాలుగా ఆర్థికంగా నష్టపరిచే నిర్ణయాలు భారత్ తీసుకుంది.. ఇది చాలు అన్నట్టుగా ఇప్పుడు యుద్ధానికి పాక్ కవ్విస్తుంటే కుమ్మి పారుస్తుంది. దీంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం పాకిస్తాన్ బతికి బట్ట కడుతుందా ? భారతతో యుద్ధం చేస్తే గట్టెక్కుతుందా అని చర్చించుకుంటున్నారు. యుద్ధం ముగిశాక పాక్ అన్నది ఇలాగే ఉంటుందా ? లేదా ముక్కలు చెక్కలు అవుతుందా అన్నది కూడా ఎవరికీ అంతు పట్టడం లేదు. మొత్తంగా చూస్తే కనుక పాక్ దేశం భారత్‌తో పెట్టుకుని తప్పు చేసింది అన్నదే ఇప్పుడు అంతా వినిపిస్తున్న మాట. ఎప్పుడు లేనటువంటి అనుకూల వాతావరణం ఇంకా బయట కలిసి రావడంతో భారత్ దాయాది దేశం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ దెబ్బతో పాక్ రాక్షస సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నట్టుగా భారత్ కంకణం కొట్టుకుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు