కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ కు సంబంధించిన కొంత మంది ఉగ్రవాదులు అమాయకులైన భారతీయులను అనవసరంగా చంపేసిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇలా పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులైన భారతీయులను క్రూరంగా చంపి వేసిన విషయాన్ని భారత ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది . దానితో అలా అమాయకులైన భారత్ ప్రజలను చంపిన వారిని ఏమీ చేయకుండా వదిలేస్తే వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. అలాగే వారు మరిన్ని దాడులు చేసే అవకాశం కూడా ఉంది. అందుకే వారిని అలాగే వదిలి పెట్టకూడదు అనే ఉద్దేశంతో భారత ఆర్మీ ఒక్క సారిగా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వారిని మట్టు పెట్టింది.

దీనితో పాకిస్తాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వం మా ప్రదేశం పై దాడి చేసింది. వారు ఉగ్రవాదులు కావచ్చు. కానీ వారిని చంపే క్రమంలో వారు చేసిన దాడువల్ల మా ప్రజలు కూడా చనిపోయారు. అందుకు ప్రతీకార చర్యగా మేము కూడా భారత్ పై దాడి చేస్తాము అని ప్రకటించింది. చెప్పిన విధంగానే భారత్ పై దాడి చేసింది. కానీ ఏ దశలో కూడా పాకిస్తాన్ , భారత్ ను ఇబ్బంది పెట్టలేక పోయింది. కానీ భారత్ మాత్రం తన దాడితో పాకిస్థాన్ కి ముచ్చమటలు పట్టించింది. ఇక భారత్ దాడి వల్ల చాలా నష్టపోయిన పాకిస్తాన్ , భారత్ తో రాజిపడడానికి పడడానికి రెడీ అయింది.

అందులో భాగంగా ట్రంప్ మధ్య వర్తిగా ఉండడంతో ఇండియా - పాక్ మధ్య యుద్ధం వద్దు అని ఒప్పందం జరిగింది. దానితో భారత్ వెనక్కు తగ్గింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇచ్చిన మాట తప్పి మళ్లీ యుద్ధాలను చేస్తుంది. దీనితో అనేక మంది పాకిస్తాన్ మాటలు అస్సలు నమ్మవద్దు. వారి మాటకు విలువలేదు అంటూ అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: