భారతదేశంలో వారసత్వ రాజకీయాలు విపరీతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తండ్రి ఒక్కడు సక్సెస్ అయితే... పిల్లలు కూడా రాజకీయాల్లోకి దిగిపోయి... దూసుకు వెళ్తున్నారు. అలా ఇప్పటికే చాలామంది రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. మరికొంతమంది సక్సెస్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ... తన కుటుంబ రాజకీయాలను భుజాలపై మూసుకొని ముందుకు వెళ్తున్నారు.
 రాహుల్ గాంధీ... నానమ్మ అలాగే తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరు ప్రధాన మంత్రులు అయ్యారు. సోనియాగాంధీకి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ఆమె వదులుకున్నారు. భారతదేశ అన్ని దాదాపు 50 సంవత్సరాలపాటు రాహుల్ గాంధీ కుటుంబమే పాలించింది.


అయితే అలాంటి రాహుల్ గాంధీకి ఇప్పటివరకు.. ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు అవకాశం రాలేదు. గత పది ఏళ్లుగా మోడీ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో... అవకాశం ఉన్న కూడా రాహుల్ గాంధీ సక్సెస్ కావడం లేదు.  మొన్నటికి మొన్న కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న సమయంలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు. అమెరికాలో ఉద్యోగం చేసుకునే కేటీఆర్... ఉద్యమంలో పాల్గొని... ఇప్పుడు తెలంగాణలోని నెంబర్ వన్ నాయకుడి స్థాయికి ఎదిగారు.  


 గులాబీ పార్టీలో.. కెసిఆర్ తర్వాత కేటీఆర్ అన్నారు రేంజిలో ఇప్పుడు రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. అటు మంత్రిగా అలాగే ఎమ్మెల్యేగా మంచి అనుభవం ఉంది. అలాంటి కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనేక అడ్డంకులు వస్తున్నాయి. కెసిఆర్ మరో 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన హరీష్ రావు లేదా కవిత రూపంలో కేటీఆర్ కు.. పోటీ ఉండే ప్రమాదం పొంచి ఉంది. అదృష్టం కలిసొస్తే తప్ప... ఇప్పట్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు.


 అటు నారా లోకేష్ పరిస్థితి అలాగే ఉంది. మరో 4 ఏళ్లపాటు చంద్రబాబు నాయుడు  అధికారంలో ఉంటారు. ఆ తర్వాత రాజకీయ రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ కూడా  ఉంది. అలాంటప్పుడు... నెక్స్ట్ ముఖ్యమంత్రి స్థానం నారా లోకేష్ దే. కానీ.. చంద్రబాబు సైడ్ అయిపోతే.. టిడిపి పార్టీ అంతలా ముందుకోవడం చాలా కష్టమని చెందుతున్నారు. నారా లోకేష్ భాష విషయంలో... ఇప్పటికీ చిక్కులే. కాబట్టి ఇక నుంచి నారా లోకేష్ కష్టపడితే మరో 10 సంవత్సరాల తర్వాత అయినా ముఖ్యమంత్రి అయ్యే.. ఛాన్స్ లో ఉంటాయి. ఇలా ముగ్గురికి మూడు సమస్యలు ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: