
మరికొద్ది రోజులలో టిడిపి మహానాడు జరుగుతుంది. పోలీట్ బ్యూరో మీద చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారి బ్యూరోలో అతిపెద్ద మార్పులు ఉంటాయని .. సీనియర్లకు చెక్ పెట్టి జూనియర్లు ఆ ప్లేస్ లోకి వస్తారని అంటున్నారు. మరి సీనియర్లలో ఎవరిని తెప్పిస్తారు ? అనే అందరూ ఆలోచన చేస్తున్నారు. లోకేష్ టీం తో పోలిట్ బ్యూరో ఈసారి ఉంటుందని అందరూ అంటున్నారు. దీంతో సీనియర్లకు ఇక రెస్ట్ తప్పదన్న చర్చకి వినిపిస్తోంది. ఇంతకాలం మంత్రులు కాకపోయినా పార్టీలో అత్యున్నత హోదాలో ఉండి మెంబర్లుగా ఉన్నామని సీనియర్లు ఎందరో కొంత సంతృప్తి చెందేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా పోతే సీనియర్లు ఏం చేయాలన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి టిడిపి పోలీట్ బ్యూరోలో చాలా కొత్త మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు