
యూట్యూబ్ ముసుగులో భారత సైనిక స్థావరాలకు సంబంధించిన అన్ని విషయాలను చిత్రీకరించి దేశ రహస్యాలను గూఢచారిగా పాకిస్థాన్ కి చేరవేసిందట. 2024 లో హర్యానా, పంజాబ్ వంటి ప్రాంతాలలో సైనికుల కదలికలను చేరవేస్తూ ఉన్నదనే అనుమానం రావడంతో ఆమె మొబైల్ ని పరిశీలించడంతో చివరికి ఇమెను దేశద్రోహిగా రక్షణ శాఖ పట్టుకున్నది. అప్పటినుంచి ఈమెకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటిగా పోలీసులు దర్యాప్తులో భాగంగా బయటపెట్టారు.
పహల్గాం జరిగిన ఉగ్రదాడిలో కేవలం మూడు నెలల ముందు జ్యోతి పాకిస్థాన్ లో పర్యటించిందని అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జ్యోతి పాకిస్తాన్ పర్యటనలకు సంబంధించి వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా ఒక వీడియోలో జ్యోతి లాహోర్లో ఒక రెస్టారెంట్లో కొంతమందితో కలిసి భోజనం చేసినట్లుగా కనిపించిందట అయితే ఆమెతో పాటు ఉన్న వ్యక్తులు ఎవరిని విషయం పైన పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె తో జ్యోతి కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయట .అలాగే పంజాబ్ ముఖ్యమంత్రితో కూడా ఫోటోలు దిగినట్లుగా కనిపించింది. దీంతో పోలీసులకు మరిత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫహల్గం ఉగ్రదాడి వెనక ఈమె పాకిస్తాన్ పర్యటన హస్తము ఉందని..గూఢచారిగా ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చిందంటూ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నదట.