
మహానాడు సీఎం చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసంతో ఆరంభమవుతుంది. మొదటి రోజు పార్టీ ప్రతినిధుల సభలో సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుగుతాయి. కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగు జాతి ఖ్యాతి అంశాలపై తీర్మానాలు ఆమోదించనున్నారు. స్త్రీశక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి వంటి అంశాలపైనా చర్చలు సాగనున్నాయి. పార్టీ సాధించిన విజయాలను ప్రదర్శించే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వైద్య, రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు.
రెండో రోజు కూటమి ప్రభుత్వం ముసాయిదా తీర్మానాలపై చర్చలు జరుగుతాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ వ్యూహాలను రూపొందించి, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశిస్తారు. కడపలో ఈ మహానాడు రాయలసీమ అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. ఈ సందర్భంగా కార్యకర్తల ఉత్సాహాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు రూపొందించారు.
మూడో రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభలో సీఎం చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వ్యూహాలపై నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. మూడు లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ మహానాడు టీడీపీ బలాన్ని చాటడమే కాకుండా, రాయలసీమలో పార్టీ పటిష్టతను ప్రదర్శించే వేదికగా నిలుస్తుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు