కేబినెట్ విస్తరణ వేళ తెలంగాణలో మరో ముసలం మొదలయ్యింది. రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీతో ఇటీవల జరిగిన భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ పై ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికే కొంతమంది నేతలు మంత్రి పదవుల కోసం పావులు కదపగా తాజాగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమైనట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలోని మందుల సామేలు, కల్వంపల్లి సత్యనారాయణ, తోట లక్ష్మీకాంతారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీక్రెట్ గా భేటీ అయినట్టు ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశంలో తమ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 47 లక్షల మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారని ఎన్నికల సమయంలో వారంతా కాంగ్రెస్ కు ఎంతో మద్దతు ఇచ్చారని నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ మంత్రివర్గంలో తమకు స్థానం దక్కలేదని వీరు ఆవేదన వ్యక్తం చేసుకోనట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం ఎమ్మెల్యేలు తెలంగాణ ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ తో ఫోన్ లో మాట్లాడి తమ డిమాండ్లను విడిపించినట్టు సమాచారం.
ఈ విషయంపై మరింత లోతుగా చర్చించేందుకు వారిని స్వయంగా కలవమని మీనాక్షి సూచించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం ద్వారా పార్టీ అధిష్టానం పై ఒత్తిడి పెంచి మాదిగ వర్గానికి కేబినెట్ లో స్థానం సంపాదించాలని ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో మంత్రులను కేటాయించిన సమయంలోనూ పలువురు మాదిగ నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కుతుంది అన్న సమయంలోనూ మాదిగ నేతలకు పదవి ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. మరి తాజా పరిణామాలతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.