
అయితే ఒక పత్రిక జగన్ కు చెడు చేయాలని భావించి జ్జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు చేసిన మంచి గురించి బయటపెట్టింది. రాష్ట్రంలో జగన్ సర్కార్ పంపిణీ చేసిన 8 లక్షల ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయని పేదల పేరుతో పెత్తందారులు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని చెప్పుకొచ్చారు. 18 లక్షల 34 వేల మంది ఇంటి పట్టాలు పొందారంటూ ఆ పత్రిక రాసిన కథనంలో పేర్కొనడం కొసమెరుపు.
8 లక్షల ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయని ఈ పత్రిక చెబుతున్నా అదే సమయంలో 10 లక్షల మంది ఇళ్లు కట్టుకున్నారని చెబుతుండటం కొసమెరుపు. ఏపీ చరిత్రలో ఏ సీఎం పాలనలో కూడా ఇంతమంది ఇళ్లు కట్టుకున్న సందర్భాలు లేవు. ఈ స్థాయిలో ఇళ్లు ఇచ్చిన పట్టాలు కూడా లేవు. ఇళ్ల స్థలాలు ఎప్పుడైనా ఊరి చివర తప్ప మరెక్కడా ఇవ్వలేరనే సంగతి తెలిసిందే.
జగన్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా విమర్శించడం మాత్రం సాధారణం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జగన్ ఎంత మంచి చేసినా ఆ పత్రికలకు కనబడదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ కు ప్రజల్లో మద్దతు పెరుగుతున్న ప్రతి సందర్భంలో ఆ మద్దతు రాకుండా ఉండటానికి పత్రికలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పత్రికలను మాజీ సీఎం జగన్ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదనే సంగతి తెలిసిందే.