
ముద్రగడ పద్మనాభం బయటకు రావడం లేదు . ఈ లేఖ ఎవరు రాశారో ఆయన సంతకం చేశారో లేదు అనేది కూడా తెలియటం లేదు .. కానీ సాక్షి మీడియాలో మాత్రం .. లేఖ తో గట్టి పండగ చేసుకుంటుంది .. ప్రధానంగా అందులో తన కొడుకు రాజకీయ ఎదుగుదలను చూడలేక కుట్రలు చేస్తున్నట్లుగా ప్రధానంగా చెప్పుకొచ్చారు .. అలాగే తన వియ్యంకుడు తో వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపణ చేశారు . తన భార్యకు అనారోగ్యం వచ్చినప్పుడు కుమార్తె ఇంటికి వెళితే పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు .. ఆ కుటుంబ వివాదాలకు సూపర్ సిక్స్ హామీలకు ఏం సంబంధం కానీ లేఖలో ఈ విషయాలను చెప్పారు ..
అలాగే తన కొడుకే కాదు తన మనవడికి రాజకీయ జీవితం ఇస్తానని . అలాగే ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తానని కూడా చెప్పుకొచ్చారు .. ఎవరైనా కూతురితో జరిగిన వివాదాలను రాజకీయానికి ముడి పెట్టకుండా ఆయన ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఇలా రాజకీయంగా స్పందిస్తారా ? తెలివి మెదడు ఉన్న తండ్రి ఎవరైనా స్పందించి అవకాశం ఉండదు . కానీ ముద్రగడ ఫ్యామిలీ తో వైసిపి ఆడుతున్న రాజకీయ క్రీడలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది . వైసిపి చేస్తున్న రాజకీయాల వల్ల ముద్రగడ్డ కుటుంబం మళ్లీ కోలుకొనే అవకాశం లేదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ..