
షర్మిల ఫోన్ ట్యాపింగ్ ముఖ్యంగా .. తన అన్న కోసం జరిగిందని కోడ్ లాంగ్వేజ్ ద్వారా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది .. అయితే ఇందులో మెయిన్ అన్న ఎవరు అనేది తెలియాల్సి ఉంది .. కేటీఆర్ కూడా .. జగన్ రెడ్డిని అన్నా అని గతంలో పిలిచారు .. ఇక షర్మిలకు కూడా జగన్ అన్నయ్య అవుతారు .. ఇక జగన్ రెడ్డితో ఆస్తి గొడవలు తర్వాత షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు . అలాగే అక్కడ పాదయాత్ర కూడా చేశారు .. తర్వాత పెద్దగా బలం చూపించలేకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు . అయితే ఈ క్రమంలోనే ఆమె రాజకీయాలపై జగన్ కోసం తెలంగాణలో నిఘా పెట్టారని అనుమానాలు ఇప్పుడు వస్తున్న వార్తలతో నిజమవుతున్నాయి .
అయితే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుపుతున్న సీట్ .. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనుమానిస్తున్న వారి నుంచి వాంగ్మూలాలు అందుకుంటుంది .. అందులో భాగంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు .. షర్మిల కూడా గతంలో ఈ ఆరోపణలు చేశారు కాబట్టి ఇప్పుడు వివరాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు .. ఈ క్రమంలో చంద్రబాబు ఫోన్ టాపింగ్ జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి ఇక మరి .. ఇదే నిజమైతే మాత్రం కేసీఆర్, జగన్ మెడకు గట్టి ఉచ్చు పడిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు .