
సినిమా డైలాగ్స్ ను అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా నియమాలను పాటించాల్సిందేనని ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలని పోలీసులకు దిశా నిర్దేశం చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళను ఉపేక్షించమని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ రియాక్షన్ గురించి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
పవన్ కళ్యాణ్ జగన్ కామెంట్లను తీవ్రంగా ఖండించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీ షీట్లు తెరిచి వాళ్ళను అదుపు చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు. అశాంతిని, అభద్రతను కలిగించే వాళ్లకు మద్దతుగా అప్రజాస్వామిక దోరణిలో మాట్లాడుతున్న వారి విషయంలో ప్రజలు సైతం అప్రమత్తంగా చెప్పుకొచ్చారు. వాళ్ళను ఓ కంట ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని ప్రదర్శనలు చేసేవాళ్లను కట్టడి చేయకపోగా వాళ్ళను సమర్థించేలా మాట్లాడే నేరమయ ఆలోచనలు ఉన్నవాళ్లను ప్రజలు గమనించాలని పవన్ అన్నారు.
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం నేరమే అని మరిచిపోవద్దని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. పవన్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.