
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం 1951 కోట్ల రూపాయలు విరాళంగా తృణమూల్ కాంగ్రెస్ కు 1705 కోట్ల రూపాయలు దక్కగా బీజేడీ పార్టీకి 1019 కోట్ల రూపాయలు, డీఎంకే పార్టీకి 676 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దక్కాయి. ఈ మొత్తం ఒకింత భారీ మొత్తం అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ జాబితాలో వైసీపీ తోలి స్థానంలో ఉండటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వైసీపీకి 503 కోట్ల రూపాయలు విరాళంగా దక్కగా బి.ఆర్.ఎస్ కు 383 కోట్ల రూపాయలు విరాళంగా దక్కాయి. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నా టీడీపీ మాత్రం 320 కోట్ల రూపాయలు మాత్రం విరాళంగా దక్కింది. ఈ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
వైసీపీ, టీడీపీ లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఈ రెండు రాజకీయ పార్టీలకు మాత్రమే అధికారం దక్కుతోంది. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఎంతో కష్టపడుతోంది. జగన్ రాష్ట్రంలో ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు