అమెరికాలో చట్టాలు చాలా బలంగా ఉంటాయి. అమెరికాలో ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినట్లయితే వారు కోర్టును ఆశ్రయిస్తే వారికి చాలా త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. తాజాగా అమెరికా కోర్టు ఓ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళితే ... అమెరికాలో మన భారత దేశానికి చెందిన , అందులో మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని కొన్ని సంవత్సరాల క్రితం కుక్క కరిచింది. దానితో ఆయన ఆ కుక్క యజమానితో పై కేసు వేశాడు. ఎట్టకేలకు ఆయనకు ఆ ఆ కేసు విషయంలో న్యాయం జరిగింది. పెద్ద మొత్తంలో నష్టపరిహారం కూడా వచ్చింది. ఈ కేస్ విషయంలో అసలు ఏం జరిగింది అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కి చెందిన కిషోర్ వెలవంక ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నాడు. ఈయన ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళాడు. ఆయన ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళాక 2011 సంవత్సరం ఆయన ఇంటి పక్కన ఉంటున్న కార్లి అనే మహిళ కుక్క ఇతనిపై దాడి చేసింది. ఆ తర్వాత దాడికి గాను ఆమె నష్టపరిహారం కూడా ఇస్తాను అని మాట ఇచ్చింది. ఆమె అతనికి వైద్య ఖర్చుల కోసం 600 డాలర్లు ఇస్తాను అని హామీ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత డబ్బులు ఏమి ఇవ్వకుండా అతనిపై దుర్భాషలాడింది. దానితో కిషోర్ వాషింగ్టన్ డిసి లో కోర్టును ఆశ్రయించాడు. వాదనల తర్వాత అదే సంవత్సరం కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వైద్య ఖర్చులు , న్యాయ ఖర్చులు , వడ్డీ , పరిహారం కలిసి మొత్తంగా 10359 డాలర్లు బాధితుడికి నష్టపరిహారంగా చెల్లించాలి అని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ కార్లి ఐపి పెట్టినట్లు చెప్పి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇటీవల కార్లి తన ఇల్లు అమ్మింది. దానితో కోర్టు ఆదేశాల మేరకు కొనుగోలుదారుల నుండి కిషోర్ కు వట్టితో కలిసి 29092 డాలర్లు వచ్చాయి. లాయర్ ఫీజులు , ఇతర ఖర్చులు పోను 18428 డాలర్లు అంటే 15.73 లక్షలు తన ఖాతాలో జమయ్యాయి అని కిషోర్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: