ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ, జనసేన, టిడిపి కలిసి పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఇక్కడ టిడిపి విజయానికి జనసేన ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ఇంత చేసినా కానీ  భవిష్యత్తులో జనసేనకు సొంతంగా పోటీ చేసి గెలిచే అవకాశాన్ని మాత్రం టిడిపి నాయకులు ఇవ్వడం లేదని అర్థమవుతుంది. అంతేకాకుండా పవన్ కూడా ప్రతి వేదికలో జగన్ ను అధికారంలోకి రానివ్వం అని చెబుతున్నాడు తప్ప తాను సొంతంగా అధికారంలోకి వస్తానని ఏనాడు అనడం లేదు. అంతేకాకుండా ఆయన లక్ష్యం కూడా జగన్ ను ఎదగనివ్వకపోవడమే.. అంటే పవన్ కళ్యాణ్ మాటలు టిడిపికి కలిసి వచ్చేలా ఉన్నాయి. 

ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడర్ గ్రౌండ్ లెవెల్ లో జనసేన వారిని అస్సలు పట్టించుకోవడం లేదట. వందకి 95% మందిని గ్రౌండ్ లెవెల్ లో ఎదగనివ్వకుండా చేస్తున్నారట..ఇలా జరిగితే జనసేన ఎప్పటికీ అధికారంలోకి రాకుండా ఉంటుంది. పైకి చంద్రబాబు ఎంతో సపోర్ట్ ఇస్తున్నట్టు చెబుతున్నా కానీ కింది స్థాయిలో కేడర్ మాత్రం అస్సలు ఎదగనివ్వడం లేదు. దీన్నిబట్టి చూస్తే జనసేన ఫ్యూచర్ లో కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. కేవలం తెలుగుదేశం నాయకత్వాన్ని మాత్రమే అధికారంలో ఉంచడం కోసం జనసేన పని చేస్తుందని చాలామంది అంటున్నారు.

పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చూస్తే మాత్రం మరో 15 ఏళ్లపాటు టిడిపి కింద బానిసత్వం చేయడమే వీరి పనా.. అంతేకాదు టిడిపి నాయకులు కూడా వీరిని  ఎదగనిస్తే మాకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతోనే ముందుగానే వారిని ఏ విషయంలో కూడా పట్టించుకోకుండా ఉంటున్నారా అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ.. ఈ ఇష్యును పవన్ కళ్యాణ్  తేలికగా తీసుకోకుండా తన కేడర్ కు సపోర్టు వచ్చేలా చూస్తేనే  భవిష్యత్తులో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది.లేదంటే టీడీపీ కింద బానిసత్వం చేస్తూ బతకాల్సిందే అని రాజకీయ మేధావులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: