
తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 25 ఏళ్ల క్రితం ఈ సీరియల్‌లో ఒక్క ఎపిసోడ్‌కు రూ. 1800 మాత్రమే పారితోషికంగా అందుకున్న స్మృతి, ఇప్పుడు అదే సీరియల్ పార్ట్ 2 కి ఎపిసోడ్‌కు రూ. 14 లక్షలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది . ఇక ఆమె కెరీర్ ఆరంభం గురించి చెప్పాలంటే, స్మృతి మొదట మెక్‌డొనాల్డ్స్‌లో ఉద్యోగిగా పని చేశారు. అక్కడ కూడా ఆమెకు నెల జీతంగా రూ. 1800 మాత్రమే లభించింది . ఏక్తా కపూర్ నిర్మాణంలో రూపొందిన ‘కుంకీ సబ్బీ కబీ హమ్ తే’ సీరియల్ మొదటి భాగం దాదాపు 150 ఎపిసోడ్లు ప్రసారమైంది .
ఇక ఇప్పుడు రెండో భాగానికి పునరావృతం కావాలన్న ఉద్దేశంతో , మొదటి భాగంలో నటించిన కొన్ని కీలక పాత్రలను మళ్లీ తీసుకోవాలని ప్రణాళిక వేసారు. ఈ క్రమంలోనే ఏక్తా కపూర్, స్మృతి ఇరానీని సంప్రదించగా ఆమె పాజిటివ్‌గా స్పందించారని , ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కూడా పూర్తయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి . తన నటనతో ఓ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్మృతి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో మందికి ప్రేరణగా మారింది. ఇప్పుడు మళ్లీ టీవీ రంగంలో అడుగుపెడతారా ? అన్నది ఆసక్తికర అంశంగా మారింది . స్మృతి ఇరానీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిన పని మాత్రమే మిగిలుంది!