ఈ మధ్యకాలంలో నేరస్తులు పోలీసుల కంటే తెలివి మీరు పోతున్నారు. అయితే నేరాలు చేసిన వారు తప్పించుకోగలమని ధీమా ఉన్నప్పటికీ పోలీసులు వాటన్నిటికీ కూడా అడ్డుకట్టు వేస్తూ చేదిస్తున్నారు. తాజాగా ఒక భర్త తన భార్యను సైతం హత్య చేసి మరి తప్పించుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసిన తీరు చూసి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన భార్య శవాన్ని పొలంలో పూడ్చిపెట్టి వాటిపైన కూరగాయలు నాటడమే కాకుండా ఆ తర్వాత ఊరు విడిచి ఏకంగా తొమ్మిది నెలలపాటు ఎవరికి కనిపించకుండా తిరిగారు.



అయితే చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలు అయినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని రేవా ప్రాంతంలో చోటుచేసుకున్నది. పూర్తి వివరాల్లోకి వెళితే రేవా జిల్లాలోని సౌభాగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నటువంటి దేవముని, రామ్ వతి భార్య భర్తలు ఉన్నారు. అయితే వీరికి ఒక కుమారుడు ఒక కూతురు కూడా ఉన్నారు. పొలంలో దేవముని కూరగాయలు పండిస్తూ ఉండేవారు. ఇందుకు తన కూతురు, భార్య కూడా సహాయం చేసేవారు. గత ఏడాది అక్టోబర్ 11వ తేదీన తన భార్య అయిన రామ్ వతిని దేవ్ ముని చంపేశారు.


ఆమె నోట్లో పురుగులు మందు పోసి మరి హత్య చేసి అనంతరం ఆ శవాన్ని పొలంలో పూడ్చిపెట్టి ఎలాంటి అనుమానం రాకుండా వాటిపైన కూరగాయల చెట్లు నాటేశారు. అయితే మధ్యాహ్నం సమయంలో రామ్ వతి కొడుకు అభిలాష్ పొలంలోకి వచ్చి తన తల్లి కనిపించడం లేదని తన సోదరుని అడగగా తను ప్రయాగ్ రాజ్ కి వెళ్లిందని చెప్పింది. కానీ తన తల్లి సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో అభిలాష్ వెళ్లి మరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కేసు నేపథ్యంలో దేవ్ ముని తన కూతుర్ని తీసుకుని ఊరు విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు సైతం దేవ్ ముని భార్యను చంపి పొలంలో పూడ్చి పెట్టాడని కనుక్కున్నారు. మృతి దేహాన్ని వెలికి తీసి పరారీలో ఉన్న దేవ్ ముని కోసం పోలీసులు గాలించి మరి అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: