ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తుతం  రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 300 పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. అంతేకాకుండా 100 కుపైగా ఓఎంసి ల్యాబ్ నివేదికలను దీనికి జత చేశారు. అలాగే 100కు పైకి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కోర్టుకు సమర్పించారు. మొత్తం 62 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు ఛార్జ్ షీట్ లో వివరాలు పొందుపరిచారు. 268 మంది సాక్షులను విచారించి  11 మంది వాంగ్మూలాలు రిమాండ్ రిపోర్టులు ఇతర పత్రాలు జత చేసారు. బ్యాంకులు, గోల్డ్,కంపెనీలు, స్థిరాస్తి సంస్థల్లో పెట్టుబడుల వాంగ్మూలాల పై సిట్ పొందుపరిచింది. 

ముఖ్యంగా మిథున్ రెడ్డి తో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 12 కు చేరింది. A1గా రాజ్ కసిరెడ్డి,ఏ 4 గా మిథున్ రెడ్డి, ఏ6గా సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏ8 గా చాణక్య, ఏ 13 గా దిలీప్, ఏ 31 గా  ధనుంజయ్ రెడ్డి,ఏ32 గా కృష్ణమోహన్ రెడ్డి, ఏ 33 గా బాలాజీ గోవిందప్ప, ఏ 34 గా వెంకటేష్ నాయుడు, ఏ35 గా నవీన్ కృష్ణ, ఏ 36 బాలాజీ యాదవ్, ఏ 38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఉన్నారు. ఈ చార్జి షీట్ లో మిథున్ రెడ్డి పేరు ఉన్నా కానీ ఆయన పాత్ర ఏంటి అనేది సిట్ అధికారులు ఇప్పటివరకు ప్రస్తావించలేదు. అంతేకాకుండా మద్యం ముడుపులు షెల్ కంపెనీల ద్వారా రావడం, బ్లాక్ మనీ వైట్ గా మార్చడం తదితర అంశాలను వెల్లడించింది.

20 రోజుల్లో మరో చార్జిషీట్ ని దాఖలు చేస్తామని తెలియజేసింది. అయితే సిట్ అధికారులు  ఈ కుంభకోణం కేసులో మధ్య మధ్యలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పేరును కూడా ప్రస్తావించింది. దోపిడీకి వీలుగా నూతన మద్య విధానం రూపకల్పన సహా, పలు అంశాల్లో జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించింది. కానీ అభియోగ పత్రంలో ఆయన్ని నిందితుడిగా మాత్రం పేరు చేర్చలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో అనుబంధ అభియోగ పత్రాల్లో జగన్ ప్రమేయంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఈ లిక్కర్ స్కామ్ కేసు ఎలాంటి  అలజడికి దారితీస్తుందో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: