రాజకీయాల్లో ప్రతిపక్షం వాళ్లు అధికార పక్షం నాయకులపై కామెంట్స్ చేయడం అనేది కామన్.. ఒక్కోసారి వారి మధ్య మాటల తూటాలు పేలుస్తూ పెద్దపెద్ద గొడవలకు కూడా దారితీస్తూ ఉంటాయి. ఆ విధంగానే ఏపీ లో కూడా  అధికార పార్టీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్ కు ప్రతిపక్ష పార్టీ కి చెందినటువంటి మాజీ మంత్రి రోజా కు మధ్య తాజాగా సోషల్ మీడియా యుద్ధం నడుస్తుందని చెప్పవచ్చు. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ ను ఆమె అపానవాయువుతో పోల్చి దారుణంగా కించపరిచింది. ఇంతకీ వీరి మధ్య ఏం జరిగింది అనే వివరాలు చూద్దాం..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న అంగరంగ వైభవంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైంది. 

అలాంటి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన పేరే పవనం అని, అందుకే నేను అంతటా తిరుగుతూ ఉంటానని తెలియజేశారు. ఈ విధంగా మాట్లాడి పవన్ తనపై విమర్శలు చేసే ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చేశాడు.. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలకు మాజీ మంత్రి రోజా తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక సంచలన ట్వీట్ చేసింది. అపాన వాయువు కూడా ఈ వాతావరణంలో అంతటా ఉంటుంది. 

కానీ దానివల్ల ఎవరికి యూస్ ఉండదు అంటూ రోజా ట్వీట్ చేశారు.. అయితే రోజా చేసిన ఈ ట్వీట్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది రోజా ఈ ట్వీట్ చేసింది పవన్ కళ్యాణ్ గురించే అంటూ రోజా పై దారుణంగా విరుచుకుపడుతున్నారు..ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు సంబంధించి అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి.కానీ ఈ వివాదాలన్నీ దాటుకొని హరిహర వీరమల్లు సినిమా తట్టుకొని నిలబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: