టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో నారా రోహిత్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు మరికొన్ని సినిమాలు నారా రోహిత్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని పెంచాయి. నారా రోహిత్ సుందరకాండ అనే సినిమాలో నటించగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. 12 కోట్ల రూపాయలకు ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడవడం గమనార్హం.

ఈ ఏడాది భైరవంతో హిట్ కొట్టిన నారా రోహిత్ సుందరకాండ సినిమాతో మరో సక్సెస్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.  ఆగష్టు నెల 27వ తేదీన మాస్ జాతర సినిమాకు పోటీగా ఈ సినిమా విడుదల కానుంది.   సుందరకాండ సినిమాతో సక్సెస్ సాధిస్తే నారా రోహిత్ మరికొన్ని క్రేజీ  ప్రాజెక్ట్ లలో నటించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే నారా రోహిత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

2029 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి నారా రోహిత్  పోటీ  చేసే ఛాన్స్ ఉందని భోగట్టా.  చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటికే నారా రోహిత్ పోటీ గురించి చర్చ జరుగుతోందని సమాచారం అందుతోంది.  తండ్రి రాజకీయ వారసత్వం కొనసాగించాలనే ఆలోచనతో  నారా రోహిత్ ఉన్నారని భోగట్టా.  చంద్రగిరిలో ఉండే కీలక నేతలతో కాంటాక్ట్ లో ఉండటం ద్వారా నారా రోహిత్  రాజకీయాల్లో ముందడుగులు వేస్తున్నారని సమాచారం.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి నారా రోహిత్ పోటీ చేస్తే  బాగుంటుందని చంద్రబాబు, లోకేష్ సైతం భావిస్తున్నారని తెలుస్తోంది.  ప్రస్తుతం చంద్రగిరిలో టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదని భోగట్టా. ఇలాంటి సమయంలో నారా రోహిత్ ఈ నియోజకవర్గంపై దృష్టి పెడితే  పరిస్థితులు సైతం మారే ఛాన్స్ అయితే ఉంటుంది.  లోకేష్ సపోర్ట్  ఉంటే  రాజకీయాల్లో నారా రోహిత్ కు తిరుగుండదని చెప్పడంలో  సందేహం అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: