
తాజాగా బోనెల విజయ చంద్ర సీఎం చంద్రబాబును కలిసారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను సమర్పించారు. పార్వతీపురం ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ఇటీవల విజయవంతంగా నిర్వహించిన “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం గురించి వివరించారు. ప్రజల్లోనూ, అధికారుల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. చంద్రబాబు స్పందిస్తూ.. పార్వతీపురం నియోజకవర్గంలో 87.97% అభివృద్ధి పనులు పూర్తి చేయడం గొప్ప విషయం అని అభినందించారు. ఇది సాధారణ రేటు కాదని.. రాష్ట్రవ్యాప్తంగా మంచి మార్కులు తెచ్చుకున్న నియోజకవర్గాల్లో ఒకటిగా పార్వతీపురం నిలిచిందన్నారు. ఈ ఊపునే కొనసాగిస్తూ అభివృద్ధి పనులను మరింత వేగంగా చేపట్టాలని సూచించారు.
ఇక చంద్రబాబు నుంచి ఈ స్థాయి మెచ్చుకోలు రావడంతో టీడీపీలో బోనెల విజయ చంద్రపై ప్రత్యేక చర్చ నడుస్తోంది. కొత్తవారికి సీఎం ఇచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న వ్యక్తిగా విజయ చంద్రని పార్టీలో అభినందనల వర్షం కురుస్తోంది. నియోజకవర్గ స్థాయిలోనూ, ప్రభుత్వ కార్యక్రమాల అమలులోనూ అసలైన ఓ ఆదర్శంగా నిలిచారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఉత్తరాంధ్ర నుంచి టీడీపీని బలోపేతం చేసే యువ నేతగా బోనెల విజయ చంద్ర ఇప్పుడే వెలుగులోకి వచ్చారు. వచ్చే రోజుల్లో ఈ నేత టీడీపీకి మరింత పాలిటికల్ అసెటుగా మారతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.