
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి టంగుటూరు జాతీయ రహదారి మీద ఒక హోటల్ కొన్నది.. దీని స్పెషల్ ఏమిటంటే టోల్ ప్లాజా మీద ఇది ఏర్పాటు చేయడం గమనార్హం. NH - 16 టోల్ గేట్ వద్ద ఏర్పాటుచేసిన రెస్టారెంట్ దూర ప్రాంతాలు చేసే వారికి చాలా సౌకర్యవంతంగా ఉన్నది. విశాలమైన పార్కింగ్ తో పాటుగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఈ హోటల్ కు కలదు. టోల్ ప్లాజా మీదనే ఈ రెస్టారెంట్ ఉండడంతో వాహనదారులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా.. భోంచేస్తూ ప్రయాణిస్తున్న వాహనాలను చూస్తూ చూడవచ్చు. వీటికి తోడు ఈ హోటల్ చూసిన వారందరూ కూడా ఏదో ఒక సరికొత్త అనుభూతిని చూస్తున్నట్లు కనిపిస్తోందట.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి తిరుపతికి హైవే మీదుగా వెళ్లే ప్రయాణికులకు ఈ టోల్ ప్లాజా అందుబాటులో కలదు.. అయితే ఈ కొత్త తరహా రెస్టారెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇలాంటి ఐడియాలతో అన్ని టోల్ గేట్ ప్లాజా వద్ద ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నేటిజెస్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ టోల్ ప్లాజా హోటల్ ని ఆదర్శంగా తీసుకొని ఏపీలో కూడా చాలా చోట్ల ప్రభుత్వం ఇలాంటి హోటల్స్ ని ఏర్పాటు చేయాలని సలహా ఇస్తున్నారు నేటిజన్స్. మరి ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం పరిగణంలోకి తీసుకుంటుందేమో చూడాలి.