
నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించిన బైరెడ్డి శబరి, అనూహ్యంగా పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతున్నారు. యంగ్ పార్లమెంటేరియన్‌గా ఆమె చూపిస్తున్న దూకుడు, కార్యాచరణ చంద్రబాబును ఆకర్షిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడుల రాక కోసం ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా, “విజన్ 2047” అనే భారీ ప్రణాళికను దేశ విదేశాల్లో ప్రస్తావిస్తూ, ప్రత్యేక వేదికలపై తన వాయిస్‌ను వినిపిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారత ప్రతినిధిగా పాల్గొన్న శబరి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రస్తావించి ప్రపంచ వేదికపై రాష్ట్రానికి ప్రాధాన్యత తీసుకురావడంలో మైలురాయిగా నిలిచారు. శబరి తన పనితీరు ద్వారా సీఎం దగ్గర మంచి మార్కులు సాధించారు. పార్టీ వర్గాల్లో ఆమెకు చంద్రబాబు అండ ఉందన్న ప్రచారం ఉంది.
శబరి పై స్థాయిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నా ఆమె ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నియోజకవర్గ స్థాయిలోనిది. నంద్యాల పరిధిలోని శ్రీశైలం, డోన్, నందికొట్కూరు, బనగానపల్లి వంటి నియోజకవర్గాల్లో శబరికి స్థానిక ఎమ్మెల్యేలతో పొసగడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు ఆమె తమతో సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ప్రొటోకాల్ పాటించకుండా అధికారులను తన ఆధీనంలో ఉంచుకున్నారు. అప్పుడు ఎమ్మెల్యేలుగా మేమెందుకు అంటూ బహిరంగ విమర్శలు చేశారు. డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా అదే స్వరంతో శబరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండానే కార్యక్రమాలను ప్రారంభించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి వ్యవహారాలపై ఆయన అభ్యంతరం తెలిపారు.
శబరి గతంలో బీజేపీలో ఉండి, ఆపై టీడీపీలో చేరిన విషయం, స్థానిక నేతలతో పూర్తిగా కలిసిపోని తీరు కూడా ఈ విభేదాలకు కారణమవుతున్నాయి. అయినా చంద్రబాబు దగ్గర శబరి ప్రాధాన్యత తగ్గడం లేదు. అభివృద్ధి ప్రాజెక్టులపై ఆమె చూపుతున్న చొరవ, పెట్టుబడుల ఆకర్షణకు చేస్తున్న కృషి పార్టీ నేతలను ఆకట్టుకుంటోంది. దీంతో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నా, ప్రత్యక్షంగా శబరిపై ఏమీ చెబడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు శబరికి ఇబ్బందులు తప్పవని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. పార్టీ మార్గదర్శకత్వంతో పాటు, స్థానిక నేతలతో సమన్వయం అవసరమని, కలిసికట్టుగా పని చేస్తేనే రాజకీయ భవిష్యత్తు బలపడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు