- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ )

జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థులు ఎవరు అనేదానిపై రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేత మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్ కు టికెట్ ఇచ్చేది లేదని స్థానికులకే జూబ్లీహిల్స్ టిక్కెట్ అని తెలిపారు. జూబ్లీహిల్స్ టికెట్స్ స్థానికంగా పనిచేసిన వాళ్లకే వస్తుంది .. పార్టీ అందరి అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తుంది అని .. బయట నుంచి వచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వమని ఆయన ప్రకటించారు. జూన్ 8న బిఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.


బిఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు కొంతకాలంగా ప్రచారంలో ఉంది. సానుభూతి ఓట్లను దృష్టిలో ఉంచుకున్న టిక్కెట్ ఇస్తారని ఊహగానాలు వెలబడుతున్నాయి. అలాగే బిఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి - రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికలలో మాజీ క్రికెటర్ మ‌హ్మాద్ అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌నే త‌న‌కు టిక్కెట్ కావాలంటున్నారు. అలాగే ఫిరోజ్ ఖాన్ - రోహిన్ రెడ్డి - విజ‌యా రెడ్డి కూడా ట్రై చేస్తున్నారు. బీజేపీ నుంచి గ‌తంలో పోటీ చేసిన లంకెల దీప‌క్ రెడ్డి, కీర్తి రెడ్డి, డాక్ట‌ర్ ప‌ద్మ వీర‌ప‌నేని, బండారు విజ‌య‌ల‌క్ష్మి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఎంఐఎం సొంతంగా పోటీ చేస్తుందా ?  లేదా ఎవ‌రికి అయినా మ‌ద్దుతు ఇస్తుందా ? అన్న‌ది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: