ఇండియన్ రైల్వే ప్రయాణికులకు తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది.. ట్రైన్ ప్రయాణాలు చేస్తున్న సమయంలో బోరింగ్ ఫిల్ అయ్యేవారికి ఈ విషయం చాలా ఉపయోగపడుతుంది. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా వినిపిస్తున్నాయి. రైల్వే సంస్థ ఒక మంచి యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్ వన్ పేరుతో తీసుకు వస్తున్న ఈ యాప్, అటు టికెట్ బుకింగ్ విషయంలోనే కాకుండా పిఎన్ఆర్ స్టేషన్స్, రైలు లైవ్ లొకేషన్ వంటి సేవలను కూడా ఇందులో ఉచితంగానే వీక్షించే అవకాశం ఉన్నది.


దూర ప్రయాణాలు రైలులో చేసే వారికి ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రయాణంలో వినోదం కోసం డేటా ప్యాక్ అయిపోవడం అలాగే నెట్వర్క్ సమస్యలు వంటివి తలెత్తుతూ ఉంటాయి. ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు వివిధ భాషలలో సినిమాలు, డాక్యుమెంటరీ ,వినోద కార్యక్రమాలను కూడా అందుబాటులో ఉంచేలా రైల్వే సమస్త ఉచిత వైఫై సదుపాయాన్ని ఉపయోగించుకొని ఈ ఓటీటి కంటెంట్ ని ఫ్రీగా చూసేలా చేస్తోంది. ఈ రైల్ వన్ యాప్ రైల్వే సర్వీసులకు మాత్రమే అందిస్తుందట.


ఇదివరకు టికెట్ బుకింగ్ కోసం ఏదైనా యాప్ అండ్ రిజర్వ్ టికెట్ కోసం మరొక యాప్, భోజనం వంటివి ఆర్డర్ చేసుకోవడానికి ఇంకొక యాప్ ను ఉపయోగించాల్సిన పరిస్థితి ఉండేది.. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం రైలు వన్ యాప్ లోనే మనం సులువుగా పొందవచ్చు. దీనివల్ల ప్రయాణికులు పలు రకాల యాప్లను డౌన్లోడ్ చేసుకోవలసిన పని ఉండదు. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ తో పాటు గా యాపిల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నది.. మొత్తానికి రైల్లో ప్రయాణించే వారికి మాత్రం ఇది ఒక చక్కటి గుడ్ న్యూస్ వంటిది. మరి ఈ ఓటిటి వల్ల రైల్వే ప్రయాణాలు మరింత ఎక్కువమంది చేసేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: