ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికలు హారహోరిగా జరిగాయి. ఉదయం మొదలైనటువంటి ఈ పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. అలాంటి ఈ పోలింగ్ సమయంలో ఎన్నో జరిగాయని తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్సీపీ పై, వైఎస్ఆర్సీపీ పార్టీ వారు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గొడవలు, కొట్లాటలు ఎన్నికల సందర్భంగా జరుగుతూనే ఉంటాయని ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి కొన్ని సిస్టం ప్రకారమే నడిపిస్తారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు.  ఈ ఏజెంట్లు ఎన్నికలకు ముందుగానే వెళ్లి వివి ప్యాట్స్ చెక్ చేసుకుంటారు. వీళ్లు సంతకం పెట్టిన తర్వాత ఎన్నికలు షురూ అవుతాయి. ఈ విధంగా ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేసుకుంటూ వీళ్ళు టిక్ చేసుకుని ఓకే అంటేనే ఓటర్లను ఓటు వేయడానికి పంపిస్తారు. 

ఇంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండగా కొంతమంది అనవసరమైన ప్రచారాలు చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లను లోపలికి పోనివ్వలేదని ఆరోపించారు. టిడిపి  వాళ్లేమో కావాలని ఆరోపణ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇంత గందరగోళం జరుగుతున్న సందర్భంగా వైసిపి వాళ్లు ఎన్ని పోలింగ్ బూతులలో  వాళ్ళని అడ్డుకున్నారని  పోలీసులను పిలిపించి ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేశారు? పోలింగ్ బూత్ లోపల దొంగ ఓట్లు వేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపై వీళ్లు ఎన్నికల సంఘానికి ఎన్ని ప్రాంతాల్లో కంప్లైంట్ ఇచ్చారు. చట్టబద్ధంగా ఎక్కడ ప్రశ్నించారు అనేది అందరి ముందున్న ప్రశ్న.? ఇది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్లే కాదు టిడిపి వాళ్ళు కూడా ఎన్నిచోట్ల పోలీసులను పిలిచి కంప్లైంట్ చేశారనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. కానీ ఇది ఎక్కడ జరగలేదు..

అంటే వీళ్ళు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవాలని మాత్రమే ఇలా చేశారు తప్ప రిగ్గింగ్ జరిగిందయితే ఎక్కడ లేదని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కటి లైవ్ రికార్డు ప్రకారమే నడుస్తోంది. ఇన్ని నిబంధనల నడుమ రిగ్గింగ్ జరిగిందనేది ఎక్కడ బయటకు రాలేదు. కేవలం రెండు పార్టీల వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని విమర్శించుకోవడం తప్ప నిజానికి ఏం జరిగిందో తెలియదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కట్ చేస్తే పులివెందులలో 74.57 పోలింగ్ అవ్వగా, ఒంటిమిట్టలో 66.39 శాతం పోలింగ్ అయింది. అయితే చాలామంది బెట్టింగ్ రాయుళ్లు తెలుగుదేశం పార్టీపై  బెట్టింగు కాసినట్టు తెలుస్తోంది. మరి ఈ ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: