ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలను సైతం అమలు చేస్తూ విబిన్న వర్గాల ప్రజలను కూడా ఆకర్షించే విధంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే దివ్యాంగుల కోసం ప్రత్యేకించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారికి ఉచితంగా బైక్స్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ పథకం వల్ల దివ్యాంగులు రవాణా ఇబ్బందులను అధిగమించవచ్చుని ,దివ్యాంగులకుఇది చాలా ఉపయోగపడుతుందని భావించి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకానికి అర్హులైన వారు అక్టోబర్ 31వ తేదీ లోపు WWW.apdascac.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.


ఈ పథకానికి సంబంధించి అర్హతలు మరియు అవసరమైనటువంటి పత్రాలను కూడా అందులో సమర్పించాల్సి ఉంటుందంటూ తెలియజేసింది. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసం కలిగి ఉన్న వారికి మాత్రమే అవకాశం 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.. 80 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ బైకులు గవర్నమెంట్ అందిస్తుంది. అలాగే పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఉండాలి ,ఏడాది ఆదాయం రూ .3 లక్షల కంటే తక్కువ ఉండడంతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.


దరఖాస్తు తో పాటుగా ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పదవ తరగతి సర్టిఫికెట్, కుల పత్రాలను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ పథకంలో లబ్ధిదారుల విషయానికి వస్తే మహిళలకు 50% పురుషులకు 50% మాత్రమే కేటాయించారు అలాగే కులాల వారీగా కూడా ఇందులో రిజర్వేషన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉద్యోగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుందట. ఈ పథకం వల్ల కేవలం దివ్యాంగుల  రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా దివ్యాంగులు ప్రతి వృత్తిలో కూడా ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం వీరికి ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: