తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాద సంఘటనలు జరిగి చాలామంది ప్రజలు మరణిస్తూ ఉన్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లోని పశ్చిమ హెరాత్ ప్రాంతంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిపోవడంతో దీంతో 17 మంది చిన్నారులతో సహా 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రావిన్స్ అధికారులు ఈరోజు సోషల్ మీడియా ఖాతా ద్వారా ధ్రువీకరించారు. ట్రక్కు, బైక్ ను బస్సు ఢీ కొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని దీంతో ఈ మంటలు చెలరేగాయని తెలియజేస్తున్నారు.


ఈ మధ్యకాలంలో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదంగా ఇది అని తెలియజేస్తున్నారు అధికారులు. ఇరాన్ నుంచి బహిష్కరించబడినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కాబూల్ వైపుగా తీసుకు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. అలా ఇరాన్ సరిహద్దు దాటగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు అక్కడ స్థానికులు కూడా ఈ బస్సుకు  అంటుకున్న మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేసిన ఈ ఘటనను ఆపలేకపోయారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడగా వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యాన్ని అందించేలా చేశారు.


బైక్ పైన వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. బస్సులో ఉన్న 71 మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు..అయితే ఇందులో 17 మంది పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. బస్సు డ్రైవర్ అతివేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందంటూ పోలీసులు సైతం అనుమానంగా ఉందంటూ తెలియజేస్తున్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారి పూర్తి వివరాలను తీసుకొని వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా  ఈ ప్రమాదం గురించి తెలియజేస్తూ అధికారులు ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: