దేశ రాజకీయాల్లో మరోసారి ఓట్ల చోరీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ “బీహార్‌లో 65 లక్షల ఓట్లు చోరీ అయ్యాయి” అంటూ ఆరోపణలు చేస్తూ అక్కడ పాదయాత్ర మొదలు పెట్టారు. కానీ ఈ ఆరోపణల వెనక వాస్తవం ఏమిటి అన్నది బయటపడుతోంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ 65 లక్షల ఓట్ల వివరాలు ప్రజల ముందుంచింది. ఎవరి ఓట్లు ఎందుకు తీసేశారో పూర్తి వివరణ ఇచ్చింది. అయినా కూడా కాంగ్రెస్ మాత్రం దీన్ని పట్టించుకోకుండా, దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తామని ముందుకు వెళ్తోంది.


ఎన్నికల సంఘం క్లారిటీ .. బీహార్‌లో ప్రకటించిన తీసివేత ఓట్ల జాబితాల్లో పెద్దగా లోపాలు లేవని అధికారులు చెప్పారు. తమ ఓట్లు తీసేశారని ఎవరూ బయటకు రాలేదు. నిజంగా లోపాలు ఉంటే ఆర్జేడీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున రచ్చ చేసేవి. కానీ ఎలాంటి గ‌ట్టి ప్రూఫ్ లేకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ ఇబ్బంది పడుతోంది. దీంతో రాహుల్ “ఓట్ల చోరీ” అనే నినాదాన్ని ముందుకు నెట్టినా, అది ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. కాంగ్రెస్ కష్టాల్లో .. సుప్రీంకోర్టు కూడా రాజకీయ పార్టీల వైఖరిపై అసహనం వ్యక్తం చేసింది. “ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేస్తే ప్రయోజనం లేదు” అని కఠినంగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ముందుకు తెచ్చిన ఉద్యమం పూర్తిగా “నమ్మకార్హత” సవాల్‌ను ఎదుర్కొంటోంది. ఓట్ల చోరీ అనే ఆరోపణ నిరూపించలేకపోతే, కాంగ్రెస్ ప్రజల్లో మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.



రాజకీయ ఫలితాలు .. మహారాష్ట్ర, హర్యానా, లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటు దొంగిలింపు కారణంగానే తాము ఓడిపోయామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ ఇప్పటి వరకు బయటపెట్టిన ఉదాహరణలు మాత్రం బలంగా లేవు. మహదేవపురా నియోజకవర్గంలో చూపించిన ఓటర్ల జాబితా లోపాలు సాధారణ తప్పుల్లానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మెట్రో నగరాల్లో అటువంటి లోపాలు తప్పక వస్తాయి.ప్రజలతో కనెక్షన్ లేకుంటే .. కాంగ్రెస్ ప్రస్తుతం ఎన్నికల సంఘంపై నేరుగా యుద్ధం చేస్తోంది. ఇది ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థపైనే దాడి చేసినట్లే అవుతుంది. ప్రజల్లో అనుభూతి కలిగించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి కానీ, సాక్ష్యాలు లేకుండా విమర్శలు చేస్తే అది ప్రతికూల ఫలితమే ఇస్తుంది. రాహుల్ గాంధీ తన వాదనను బలపర్చాలంటే ప్రజల ముందుకు అణుబాంబు లాంటి సాక్ష్యాలు పెట్టాల్సిందే. లేకపోతే ఆయన చేస్తున్న ఉద్యమం పూర్తిగా తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: