
ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ స్పష్టంగా సీనియర్ నేతల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని, జూనియర్లు వినయంగా కలిసిపోవాలని సూచించారు. కానీ వాస్తవానికి జూనియర్లు తమ మాటే వినిపించాలని పట్టుబడుతుండటం సీనియర్లలో అసహనాన్ని పెంచుతోంది. టీడీపీలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. సీనియర్ నాయకులు తమను పక్కన పెడుతున్నారంటూ వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయ్యాయి.
అయినా ఈ అంతర్గత విభేదాల్లో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ సమావేశాలకు ముందు జూనియర్లకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని స్పీకర్ ప్రకటించడం ప్రాముఖ్యంగా మారింది. ఈ క్లాసుల్లో సీనియర్ నేతల అనుభవం, విధానాలను పరిగణనలోకి తీసుకుని కొత్తవారికి మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. జూనియర్లు - సీనియర్లు కలసికట్టుగా పనిచేస్తేనే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందుతాయి. లేకపోతే, పార్టీ లోపలి కలహాలు కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి. ఏదేమైనా భవిష్యత్తులో నేతలు వ్యక్తిగత ఆధిపత్య ధోరణి పక్కనపెట్టి, సమన్వయం కలిగించుకోకపోతే ప్రభుత్వానికి పెద్ద మైనస్ అవుతుంది.