భారత ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్తలలో అత్యంత సంపన్నుడిగా పేరు సంపాదించిన రిలయన్స్ ఇండస్ట్రియల్ అధినేత ముఖేష్ అంబానీ గురించి తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఖరీదైన ఆస్తులు, విలాసవంతమైన బంగ్లాలు కూడా ఉన్నాయి. అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆస్తులు కలవు. అయితే ఇప్పుడు తాజాగా అమెరికాలో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇల్లును కొనుగోలు చేసినట్లు వినిపిస్తున్నాయి.


న్యూయార్క్ నగరంలో అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో ముఖేష్ అంబానీ ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ట్రైబెకా ప్రాంతంలో ఈ ఇంటికి 17.4  బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా 155 కోట్ల రూపాయల వరకు ఉంటుందని  తెలుస్తోంది. అయితే ఈ లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ RIL కోసం కొనుగోలు చేసినట్లు వినిపిస్తున్నాయి. ముకేశ్ అంబానీ గడిచిన రెండేళ్ల క్రితం న్యూయార్కులో మాన్ హట్టన్  ప్రాంతంలో ఒక పెద్ద బంగ్లా విక్రయించారు. ఇది హడ్సన్ నది తీరన కలదు. 2,406 చెదరపు అడుగులు కలిగిన ఈ హౌస్  నాలుగో ఫ్లోర్లలో ఉన్నది. దీనిని 9 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.


అలా ఇప్పుడు న్యూయార్క్ లో మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. వాస్తవంగా ఈ భవంతిని.. టేక్ బిలినియర్ రాబర్ట్ పేరా 2018లో 20 మిలియన్ డాలర్ల ఖర్చు చేసి కొనుగోలు చేసినప్పటికీ దీనిని లగ్జరీ హౌస్ గా మార్చాలని భావించారు. అయితే అందుకు సంబంధించి ఎలాంటి పనులు చేయకపోవడంతో ఆ భవంతిని అమ్మేసినట్లు సమాచారం. 2021లో 25 మిలియన్ డాలర్లకు ఆ భవనాన్ని విక్రయించడానికి పెట్టారు. ఇప్పుడు తాజాగా ఆ ఇంటిని ముకేశ్ అంబానీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: