జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక ఖరారయ్యింది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు కంకణం కట్టుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పోయిన చోటే విజయాన్ని మళ్లీ సాధించాలని, మాగంటి గోపినాథ్ మరణాన్ని సెంటిమెంట్ గా చూపించి తన భార్య సునితను బరిలో దింపింది. ఇదే క్రమంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలుమార్లు ఓడిపోయిన నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ టికెట్ ని కట్టబెట్టింది. అయితే ఈ ఎన్నికలు ఆయనకు ప్లస్ గా చెప్పవచ్చు. ఇదిలా నడుస్తున్న సమయంలో రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కానీ బిజెపి నుంచి అభ్యర్థి ఖరారు కాలేదని చాలామంది ఎదురుచూస్తున్నారు.

 అలాంటి ఈ సమయంలో జూబ్లీహిల్స్ లో బిజెపి అభ్యర్థిని ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈయన పేరు మాత్రం బయటకు రాలేదు. కానీ బిజెపి అధిష్టానానికి ముగ్గురు పేర్లను పంపించారు. అందులో ఒకరి పేరు ఫైనల్ అయినట్టు సమాచారం. మరి ఆయన ఎవరో ఆ వివరాలు చూద్దాం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కు సంబంధించి  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ సమావేశం ఏర్పాటు ఒకరి పేరు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రాంతం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముగ్గురి పేర్లను పంపించారు.

ఇందులో ముఖ్యంగా కీర్తి రెడ్డి,మాధవి లత,దీపక్ రెడ్డి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో.. వీరి ముగ్గురి పేర్లను ప్రధాని మోడీ అధ్యక్షతన పరిశీలన చేశారట. ఇందులో ఒకరి పేరు మాత్రమే ఫైనల్ కావాలి కాబట్టి అందులో దీపక్ రెడ్డి పేరు వైపే అధిష్టానం ముగ్గు చూపినట్టు తెలుస్తోంది. అధికారికంగా ఫైనల్ చేయలేదు కానీ త్వరలోనే ఆయన పేరు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి చూడాలి బిజెపి జూబ్లీహిల్స్ లో ఎలాంటి  పోటీ ఇస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: