
ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి డిఏ ఇతర అంశాల పైన చర్చించినట్లుగా వినిపిస్తున్నాయి. ఈరోజు ముగ్గురు మంత్రులు కలిసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు.దీంతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్ ఉద్యోగ సంఘ ప్రతినిధులతో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రులు చర్చలు జరిపినట్లుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ చర్చలలో కేవలం కొన్నిటిని మాత్రమే పరిశీలిస్తున్నట్లు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా పెండింగ్ బకాయిల అంశాల పైన, పిఆర్సి వంటి అంశం పైన సానుకూలంగా నిర్ణయాలు ఉండబోతున్నట్లు ఉద్యోగ నేతలు ఆశపడుతున్నారు. నాలుగు డీఏల పెండింగ్లో ప్రభుత్వం ఒకటి విడుదల చేయడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం కనీసం రెండైనా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే 12వ పిఆర్సి కమిషన్ ని కూడా ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆదాయం పైన ఇప్పటికి ఒక అంచనాకు రాలేకపోతున్నామంటూ ఆర్థిక శాఖ తెలియజేసినట్లు తెలిపారు మంత్రులు. దీంతో పిఆర్సి విషయంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ , కారుణ్య నియామకాలు, ప్రమోషన్స్ ఇలాంటి విషయాల పైన డిమాండ్ చేశారు. మరి దీపావళికి ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి గుడ్ న్యూస్ అందిస్తుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.