టీడీపీకి వ్యతిరేకంగా ప్రజల సెంటిమెంట్ పెరగడంతో.. ఆయన బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కింది. అయితే 2018 ఎన్నికల్లో షాక్ తగిలింది. ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా కాస్త సైలెంట్ అయ్యారు. తాజా ఎన్నికల ముందు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా.. అప్పటి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలతో కుదరకపోయింది. ఎన్నికల తర్వాత పరిస్థితులు మారడంతో పట్నం దంపతులు కాంగ్రెస్ వైపు అడుగేశారు. కాంగ్రెస్ గెలవడంతో సునీత మహేందర్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ లభించింది. కానీ ఆమెకు ఓటర్ల తీర్పు అనుకూలంగా రాలేదు. ఘోర ఓటమి తర్వాత ఆమె రాజకీయ రంగంలో పెద్దగా కనిపించలేదు.
ఇక ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబును గుర్తు చేసుకోవడం వెనుక ఏదో పొలిటికల్ క్యాల్క్యులేషన్ ఉందా? అనేది ఇప్పుడు హాట్ డిబేట్. కొందరు నాయకులు చెబుతున్నట్లుగా.. టీడీపీ-కాంగ్రెస్ మధ్య భవిష్యత్తులో ఏర్పడే కొత్త పొత్తుల వాతావరణాన్ని అంచనా వేస్తూ ఆమె ఈ ట్వీట్ పెట్టి ఉంటారంటున్నారు. మరికొందరు మాత్రం ఇది కేవలం సెంటిమెంట్ ట్వీట్ అని, ఏ రాజకీయ అర్థం లాగడం అవసరం లేదని అంటున్నారు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం — ఈ ట్వీట్‌తో పట్నం కుటుంబం మళ్లీ రాజకీయ చర్చల మధ్యలోకి వచ్చింది. సునీత ట్వీట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటో త్వరలో స్పష్టమవుతుందేమో కానీ.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పట్నం దంపతుల పేరు హాట్‌గా మారింది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి