మరోవైపు తండ్రి జైల్లో ఉన్నప్పటికీ లోకేష్ తన మనోధైర్యం కోల్పోకుండా ఢిల్లీ చుట్టూ తిరిగి, లీగల్‌గా ఫాలోఅప్ చేస్తూ “తండ్రిని బయటకు తేవడమే లక్ష్యం”గా కృషి చేసిన తీరు అందరికీ గుర్తుంది. ఇప్పుడు ఇద్దరూ అధికారంలోకి వచ్చాక ఏపీకోసం పెట్టుబడుల వేటలో మళ్లీ ముందున్నారు. లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రిగా పెట్టుబడులు తేవడంలో, సాంకేతికతను రాష్ట్రానికి అందించడంలో కీలకపాత్ర పోషిస్తుండగా, చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులతో మీటింగులు నిర్వహిస్తూ విజన్–2030 ప్లాన్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఈ తండ్రి–కొడుకుల మధ్య ఉన్న రాజకీయ కలివిడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
“ఇలాంటి బంధం రాజకీయాల్లో అరుదు”, “లోకేష్ కష్టపడితేనే చంద్రబాబు చిరునవ్వు చిందిస్తారు”, “నమ్మకం, కష్టపడే తత్వం, లీడర్‌షిప్ — రెండింట్లోనూ ఒకే రకం” అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.దీంతోపాటు ఇతర రాష్ట్రాల నేతల తండ్రి–కొడుకుల మధ్య జరిగిన విభేదాలు కూడా జనం ప్రస్తావిస్తున్నారు. కరుణానిధి – అళగిరి, దేవెగౌడ –కుమారస్వామి, కేసీఆర్ – కవిత, జగన్ – షర్మిల ఉదాహరణలు చెబుతూ “చంద్రబాబు – లోకేష్ జోడీ నిజంగా పొలిటికల్ పర్ఫెక్ట్ కాంబో”గా ఫిక్స్ అయ్యారు. మొత్తానికి రాజకీయాల్లో తండ్రి–కొడుకుల మధ్య “విభేదాలు” కాకుండా “విశ్వాసం” చూపించిన జంటగా నారా చంద్రబాబు–లోకేష్ నిలుస్తున్నారు. ఇది టీడీపీకి మోరల్ స్ట్రెంగ్త్‌గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి