భూ కేటాయింపులు, వివాదాల పైన ఇటీవలే మంత్రులు పయ్యావుల కేశవ్, పార్థసారథి, నారాయణ, ఫరూక్ వంటి నేతలు భేటీ అయ్యారు. ఏపీలో ఆన్ సైడ్ భూములు చట్టం 1977 లో చేసిన చట్ట సవరణ, నిబంధనలకులోబడి ఉన్నటువంటి భూములకు స్వేచ్ఛ కల్పించే విధంగా నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంగించిన వారి పైన చర్యలు తీసుకోవాలని అలాగే జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి , ఫ్రీ హోల్డ్ కింద కొన్ని రకాల భూములను అనుమతించకూడదంటు ప్రతిపాదన తీసుకువచ్చారు.
ఆన్ సైడ్ భూమి కేటాయించి 20 ఏళ్లు పూర్తి అయ్యి లబ్ధిదారుల చేతులలో భూమి ఉంటే వాటిని నిషేధిత జాబితా (22A) లో నుంచి తొలగించాలని ఆ తర్వాత ఆ భూములను రైతులకు శాశ్వత హక్కు కల్పించేలా ఇచ్చే విధంగా చూడాలని ఏపీ ప్రభుత్వం ఉత్తరాలను జారీ చేస్తోంది. ఇదే పని 2023లో వైసీపీ ప్రభుత్వం డిసెంబర్లో జీవో 596 తీసుకువచ్చింది నాటి ప్రభుత్వ పెద్దలు ,వైసీపీ నేతలు 13.59 లక్షల ఎకరాలు భూమిని ఫ్రీ హోల్డ్ చేశారని కూటమి ప్రభుత్వం రాగానే వాటిని విచారణ అందులో 5.74 లక్షల ఎకరాల భూములను అక్రమంగా చట్టవిరుద్ధంగా నిషేధిత జాబితా నుంచి తీసివేసినట్లుగా తేలిందని తెలుపుతున్నారు. అందుకే గత ఏడాది ఆగస్టు నుంచి ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేశారు.
ఇప్పుడు 7.85 లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ భూమి రెవెన్యూ శాఖ తాజాగా ప్రతిపాదించిన, ఈ భూమి లబ్ధిదారుల చేతిలో ఉండి సాగు చేసుకుంటే వారికి ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం చూస్తోంది. అలాగే వైసిపి ప్రభుత్వం అక్రమంగా తీసుకున్న 5.74 లక్షల ఎకరాల భూమిని తిరిగి 22A లో చేర్చే విధంగా ఆమోదించారు. ఇకమీదట పరిశ్రమలకు కంపెనీలకు, సంస్థలకు ,లీజు ప్రకారమే, భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి