జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వాడి వేడిగా సాగుతోంది.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నాయి.. ఒకరిపై ఒకరు విమర్శల తూటాలు పేలుస్తున్నారు. ఇదే తరుణంలో ప్రచారానికి ఎక్కువగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి నాయకులు కనిపిస్తున్నారు. కానీ బీజేపీ నుంచి వచ్చిన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకులు మాత్రం ప్రచారానికి రావడం లేదని చెప్పవచ్చు.. జూబ్లీహిల్స్ లో బీజేపీకి పట్టు ఉన్నా కానీ ఈ నాయకులు వెనకంజ వేయడం వల్ల బీజేపీ కాస్త వెనుకబడి పోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అలాంటి  ఈ ఎన్నికల్లో పవన్, బాలకృష్ణ ను ప్రచారంలో దించితే లంకల దీపక్ రెడ్డికి మైలేజ్ పెరుగుతుందా.. ఆ వివరాలు చూద్దాం.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు బీ టీమ్ గా ఎంఐఎం సపోర్ట్ చేస్తూ వస్తోంది. 

అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి యాదవ ఓట్లు కూడా ఆయనకి పడే అవకాశం ఉంది. ఇక బిఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య సునితని పెట్టడం, ఆమెపై కొంతమంది నెగటివ్ ప్రచారం చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ విధంగా రెండు పార్టీలు ఎవరి పంథాలో వాళ్ళు వెళ్తున్నారు. ఇదే తరుణంలో భారతీయ జనతా పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. అయితే కాంగ్రెస్ తరపున మంత్రులు ఇతర స్టార్ కాంపైనర్లు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు, కేటీఆర్ వంటి పెద్ద పెద్ద లీడర్లు వచ్చి ప్రచారం చేస్తున్నారు.

కానీ దీపక్ రెడ్డి విషయానికి వచ్చేసరికి కేవలం నామినేషన్ సమయంలోనే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రామచంద్రరావు వంటి లీడర్లు అంతా కలిసి ఒక మైలేజ్ తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వీళ్ళు అక్కడ కనిపించడం లేదు. అయితే పోయిన సారి ఎన్నికల్లో చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ కు ఓట్లు వేశారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.. అలాంటి ఈ తరుణంలో బిజెపి ఏపీలో జనసేన, టిడిపితో పొత్తు పెట్టుకుంది కాబట్టి దీనిలో భాగంగానే జూబ్లీహిల్స్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తో ప్రచారం చేయిస్తే మాత్రం తప్పకుండా టిడిపి, జనసేనకు సంబంధించిన ఓట్లు లంకల దీపక్ రెడ్డికి పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల బిజెపి కూడా గెలుపు తీరాల్లోకి వస్తుంది.. మరి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వచ్చి జూబ్లీహిల్స్ లో లంకల దీపక్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తారా చేయరా అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: