బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన సల్మాన్ ఖాన్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు యాడ్స్ లలో బిగ్ బాస్ షోలో హోస్ట్ గా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా తెలిసింది. నిన్నటి రోజున రాత్రి ముంబైలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైనట్లుగా తెలుస్తోంది సల్మాన్ ఖాన్. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల పాటు తెలంగాణ ఎలా ఉండాలనే విషయంపై రాష్ట్ర పౌరులు, తమ ఆలోచనలు ,అభిప్రాయాలను ఈ సర్వేలో చెప్పవచ్చంటూ తెలియజేశారు.


ఈ క్రమంలోనే భాగంగా గురువారం రోజున రాత్రి సీఎం రేవంత్ రెడ్డిని, సల్మాన్ ఖాన్ కలిశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక ప్రోత్సాహంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి సల్మాన్ ఖాన్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతొందని తెలియజేశారు సల్మాన్ ఖాన్. అలాగే తెలంగాణ రైజింగ్ సందేశాన్ని కూడా ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేలా చూస్తానంటూ హామీ ఇచ్చారట సల్మాన్ ఖాన్. ఈ విషయంతో సల్మాన్ ఖాన్ కి కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.


ఇక సల్మాన్ ఖాన్ గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ వంటి తారలు దేశ, విదేశాలలో కూడా రాష్ట్ర ప్రతిష్టను మరింత ప్రోత్సహించడంలో సహాయపడతారు ఇలాంటి హీరోలు చాలా తక్కువ మంది ఉంటారని ప్రశంసలు  కురిపించారు. అలాగే ఈ సమావేశంలో పెట్టుబడి వంటి అంశాల పైన  సల్మాన్ ఖాన్ తో చర్చలు జరిపినట్లుగా వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా సికిందర్ అనే చిత్రంలో  నటించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు కేవలం రూ .150 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించిన డైరెక్టర్ మురగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఇండియా ,చైనా మధ్య జరిగేటటువంటి సన్నివేశాల ఆధారంగా వచ్చే చిత్రంలో నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: