కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను ఆదివారం ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేస్తారని ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం జోగి రమేష్ ఇంటికి చేరుకున్న ఎక్సైజ్ అధికారులు చేరుకున్నారు. జోగి రమేష్‌తో పాటు సోదరుడు రాము ఇంటికి పోలీసులు చేరుకుని కొద్ది సేపు వేచి చూసిన అనంతరం ఆయనను అరెస్టు చేశారు. కల్తీమద్యం కేసులో జనార్దనరావు స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులు ముందుగా జోగి రమేశ్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాము అరెస్ట్ చేశారు. అనంతరం రమేష్ కి సెర్చ్ వారెంట్ అందచేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు ... ఆ తర్వాత రమేష్ ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామ శివ పేరుతో నోటీసులు జారీ చేశారు.
నకిలీ మద్యం కేసులో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పిన అధికారులు .. అనంతరం నివాసం నుంచి బయటకు వచ్చిన జోగి రమేష్ ను అరెస్టు చేశారు.
జోగి రమేష్ అరెస్టు తో ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం నమోదు అయ్యింది. ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా అధికార కూటమి వర్సెస్ ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలేందుకు సిద్ధం అవుతున్నట్టే ఉంది. జోగి రమేష్ అరెస్టు ను ఇప్పటికే వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఖండిస్తూ వస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి