వైసీపీ లెక్కల ప్రకారం సుమారు 15 వేల హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని చెబుతున్నారు. తుఫాన్ తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ “కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతోంది, బీమా ధీమా రెండూ లేకుండా పోయాయి” అంటూ మండిపడ్డారు.ఇదే సమయంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే ఆ ప్రాంతాలను సందర్శించి రైతులకు భరోసా ఇచ్చారు. “జగన్ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు” అని ఆయన ఘాటుగా స్పందించారు. ఈ మాటల యుద్ధం మధ్య జగన్ పర్యటన మరింత రగడకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మచిలీపట్నం ప్రాంతం రాజకీయంగా ఎప్పుడూ వేడిగా ఉంటుంది. మంత్రి కొల్లు రవీంద్ర వర్సెస్ మాజీ మంత్రి పేర్ని నాని మధ్య పాత వైరం అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్ పర్యటన ఆ ఫైర్‌ను మరింత రాజేయబోతుందా అన్నది హాట్ డిస్కషన్‌గా మారింది.
పైగా అక్కడ టీడీపీ–జనసేన కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో జగన్ టూర్‌కు ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇక పెడనలో జగన్ పర్యటన మరో కోణంలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. జగన్ ఆయన సొంత ప్రాంతంలోకి వస్తుండటంతో ఆ విషయం మీద కూడా స్పందన రావచ్చని అంటున్నారు. చాలా కాలం తరువాత జగన్ కృష్ణా తీరంలోకి వస్తుండటం, ఆయన ప్రజా మద్దతు పరీక్షకే సమానం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత నెలలో విశాఖ పర్యటన తర్వాత ఇది ఆయన రెండో పెద్ద పబ్లిక్ విజిట్. భారీ జనసమ్మేళనాలు, పోలీసులు అనుమతుల ఇష్యూ లాంటి అంశాల వల్ల కూడా ఈ పర్యటన హై వోల్టేజ్‌గా మారే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే - తుఫాన్ పేరుతో ప్రారంభమైన జగన్ పర్యటన, రాజకీయ రగడలతో అగ్గిపెట్టెలా మారబోతోంది. రైతు పక్షం అనే ముసుగులో జగన్ మళ్లీ ప్రజల్లో బలమైన సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఆ సిగ్నల్ ఎన్ని వోల్ట్స్‌కి ఉంటుందో, కూటమి ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి మరి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి