ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత అయినటువంటి తేజస్వి యాదవ్ స్పందించారు.. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ గెలుపు పై తాను ధీమాతో ఉన్నానని తాము గెలవబోతున్నామంటూ , ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర అధికారంలో పెనుమార్పు రాబోతోంది చివరి వరకు ఫలితాల కోసం వేచి చూడాలి అంటూ తెలియజేశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ క్లారిటీగా చెప్పారు తేజస్వి యాదవ్.
తేజస్వి యాదవ్ తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్, సోదరితో పాటుగా పాట్నాలో తన నివాసం వద్ద పార్టీ అభిమానులను కలుసుకున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ పరిపాలన పట్ల బీహార్ ప్రజలు విసిగిపోయారని అందుకే మార్పు కోరుకుంటున్నారంటు మాట్లాడారు. కానీ గెలుపు ఫలితాలు రాకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి అధికారం చేపట్టేలా కనిపిస్తోంది. మరి ఈసారి ఎన్డీఏ కూటమిలో భాగంగా నితీష్ కుమార్ ను సీఎంగా చేస్తారా ? మరెవరినైనా సీఎంగా ఎంచుకుంటారా అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అక్కడ ఓటర్లు మాత్రం నితీష్ కుమార్ చేసిన అభివృద్ధి, పనులు సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేసినట్లుగా వినిపిస్తున్నాయి. మరి ఫలితాలు అనంతరం ఎన్డీఏ కూటమి సీఎం ఎవరిని ప్రకటిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి