2000 దశక ప్రారంభంలో హిడ్మా మావోయిస్టు ఉద్యమంలో చేరి, కొద్ది కాలానికే తన దూకుడు, తెలివైన ప్లానింగ్, అడవుల్లోని భౌగోళిక పరిజ్ఞానం వల్ల నాయకత్వ స్థాయిల్లోకి ఎదిగాడు. అతని ఎదుగుదలలో కీలక ఘట్టం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్–1 లో ప్రవేశం. ఈ యూనిట్ మావోయిస్టులలో అత్యంత శక్తివంతమైనదిగా భావించబడుతుంది.
భద్రతా సంస్థల అంచనాల ప్రకారం, 2004 నుంచి ఇప్పటి వరకు కనీసం 20కి పైగా పెద్ద దాడులలో హిడ్మా నేరుగా పాలుపంచుకున్నాడు.అందులో ముఖ్యమైనవి—
*2010 దంతేవాడ దాడి – 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతిచెందిన ఘటన
*2013 జీరామ్ ఘాటి దాడి – కాంగ్రస్ నేతలు మహేంద్ర కర్మ, నందకుమార్ పటేల్ వంటి పలువురు హతమారిన ఘటన
*దండకారణ్యంలో జరిగిన అనేక అటాక్‌లు, మైనింగ్ దాడులు, భద్రతా దళాలు చాలా కాలం పట్టుకోలేకపోయాయి.
*ఈ దాడుల తీరుతెన్నుల కారణంగా భద్రతా వ్యవస్థలో హిడ్మా పేరు ఒక విధంగా భయపెట్టే విధంగా మారింది. అతడు “గెరిల్లా వ్యూహాల మాస్టర్‌మైండ్”గా అభివర్ణించబడ్డాడు.
*తప్పించుకునే నైపుణ్యం – భద్రతా బలగాలకు చిరునవ్వులు ఆరిపోయేలా చేసిన కమాండర్
*హిడ్మాను పట్టుకోవడానికి అనేక ఏళ్లుగా భారీ ఆపరేషన్లు చేపట్టినా, ప్రతి సారి అతడు అడవుల సంక్లిష్టత, స్థానిక నెట్‌వర్క్‌లు మరియు భౌగోళిక పరిజ్ఞానంతో తప్పించుకునేవాడు.
రాత్రిపూట దాడులు:
అడవుల్లో మార్గాల మార్పులు..గ్రామీణుల మద్దతు..గెరిల్లా బేస్ ఏరియాలో శీఘ్ర సంచారం..ఈ లక్షణాలు అతడిని మావోయిస్టు వర్గంలో అత్యంత ముఖ్యమైన నాయకుడిగా నిలబెట్టాయి.
ఈ సంవత్సరం హిడ్మాకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సెక్రటరీ స్థాయికి పదోన్నతి లభించినట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఇది మావోయిస్టు కేడర్‌లో అతడి ప్రభావాన్ని మరింత పెంచింది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ – ఎట్టకేలకు ముగిసిన హిడ్మా అధ్యాయం..భద్రతా సంస్థలు హిడ్మా ఆచూకీ కోసం ఎంతో కాలంగా సమాచారం సేకరిస్తున్నాయి. తాజాగా దొరికిన విశ్వసనీయ ఇంటెలిజెన్స్ ప్రకారం, హిడ్మా తన బృందంతో కలిసి అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.దీంతో భద్రతా బలగాలు సమన్వయంతో భారీ ఆపరేషన్ చేపట్టాయి. గంటల తరబడి జరిగిన కాల్పుల్లో—హిడ్మా..అతడి భార్య,కీలక కేడర్ సభ్యులు,మొత్తం ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.
హిడ్మా మరణం మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అతడు లాంటి అనుభవజ్ఞుడిని కోల్పోవడం మావోయిస్టుల వ్యూహాత్మక శక్తిని బలహీనపరచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 20 ఏళ్లపాటు దండకారణ్య అరణ్యాల్లో చలామణి అయిన హిడ్మా కథ ఇప్పుడు ముగిసింది. అతడు నడిపిన దాడులు అనేక కుటుంబాలకు అంధకారం తెచ్చాయి. అతని మరణంతో ఆ ప్రాంతంలో శాంతి పరిస్థితులు మెరుగుపడతాయా? లేక మావోయిస్టులు మరో నాయకుడిని ముందుకు తెస్తారా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి