ఖరీదైన ఆభరణాల త్యాగం: వ్యక్తిగత మేకోవర్! .. గతంలో కవిత అనగానే గుర్తొచ్చేది ఖరీదైన పట్టు చీరలు, వాటికి ఏ మాత్రం తీసిపోని వజ్రాల ఆభరణాలు, వేళ్లకు కొట్టొచ్చినట్లు కనిపించే రింగులు, పొడుగాటి నెయిల్ పాలిష్ గోళ్లు. ప్రజానేతగా కాకుండా... మిగిలిన వారికి తాను పూర్తి భిన్నమనే భావన కలిగేలా ఆమె వైఖరి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఆమె ఇప్పుడు కేవలం పొలిటికల్‌గా మాత్రమే కాదు, వ్యక్తిగతంగానూ పూర్తిస్థాయి మేకోవర్ అయ్యారు! వస్త్రధారణ: ఖరీదైన చీరలకు బదులు ఇప్పుడు పూర్తిగా నేత చీరలు ధరిస్తున్నారు. నగలు: బంగారు, వజ్ర ఆభరణాల స్థానంలో మెడలో ఇప్పుడు నల్లపూసలు (నెక్లెస్) మాత్రమే దర్శనమిస్తున్నాయి. చేతి వేళ్లకు రింగులను పూర్తిగా త్యజించారు. శైలి: పొడుగ్గా ఉండే గోళ్లను పూర్తిగా కత్తిరించేసి, గోళ్ల రంగుకు దూరంగా ఉంటున్నారు.
కేసీఆర్ ఉద్యమ వ్యూహం అమలు! .. కవిత చేస్తున్న ఈ టాప్ టు బాటమ్ మార్పు వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. ఆమె ఇప్పుడు డ్యామేజీలను పట్టించుకోకుండా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. ముఖ్యంగా సామాన్యులు, బడుగు జీవులకు దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది అచ్చంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తలపిస్తోంది.వివిధ వర్గాలకు చెందిన ముఖ్యుల్ని, పెద్దమనుషుల్ని కలుస్తూ... 'తాను అందరిదానిని' అనే భావన కలిగేలా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇంత చేసినా.. ప్రస్తుతం ఆమెకు వస్తున్న మైలేజ్ అంతంతే. ఆమె ప్రసంగాలు, పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం అంతగా లభించని పరిస్థితి. ఈ మారిన కవిత... ప్రజల్లోకి ఎంత వేగంగా చొచ్చుకుపోతారు? ఈ కొత్త ఇమేజ్ ఆమెకు రాజకీయంగా ఎంత మైలేజ్ తెచ్చిపెడుతుంది? అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. బీఆర్‌ఎస్ కోటలో ఈ మేకోవర్ ఎంత పెద్ద కుదుపు సృష్టిస్తుందో చూడాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి