స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటంటే:
స్క్రబ్ టైఫస్ అనేది orientia tsutsugamushi అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్.. ఇది చిగ్గర్స్ అనే సూక్ష్మ కీటకాలు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందట. ఈ పురుగు కాటు వేసిన ప్రాంతంలో నల్లటి మచ్చగా మారుతుంది.
వ్యాధి ఎలా వ్యాపిస్తుందంటే:
గడ్డి, తడి నేలలు, చెత్త ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఉండే సూక్ష్మ కీటకాలు కాటు ద్వారా ఈ బ్యాక్టీరియా మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది.
అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి నేరుగా సోకడం జరగదు. కేవలం ఆ కీటకం(స్క్రబ్ టైఫస్ )కుడితేనే వ్యాపిస్తుంది.
స్క్రబ్ టైఫస్ వ్యాధి కేవలం జ్వరం ద్వారానే గుర్తించలేం.. తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, ఛాతిలో బరువు, దగ్గు ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ,వాంతులు ,విరేచనాలు వంటి వాటితో పాటుగా ఆ కీటకం కుట్టినచోట నల్లటి మచ్చ ముఖ్య సూచనంగా చెప్పవచ్చు.
స్క్రబ్ టైఫస్ ను ELISA పరీక్ష ద్వారా గుర్తిస్తారట. ఇవి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు తిరుపతి విజయవాడ వంటి ప్రాంతాలలో పరీక్షలు చేస్తారట. కేసులు ఎక్కువగా పెరగడంతో ఇటీవలే ఏపీ ప్రభుత్వం అదనంగా 17 జిల్లాలలో కూడా ప్రత్యేకించి ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
స్క్రబ్ టైఫస్ కు చికిత్స ఏమిటంటే:
డోక్సిసైక్లిన్,అజిత్రోమైసిన్ వంటివి మొదటి దశ చికిత్స ప్రారంభంలో వ్యాధిని సైతం పూర్తిగా నయం చేస్తాయి.
మూడు నాలుగు రోజులు జ్వరం తగ్గకపోయినా, శ్వాస ఇబ్బందులు, తలనొప్పి దద్దుర్లు, వాంతులు విరేచనాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.
నివారణ ఎలా అంటే:
పొలాలకు,జంతువుల వద్దకు వెళ్లేవారు శరీరం మొత్తం కప్పే దుస్తులు ధరించడం మంచిది సాక్స్, షూస్ వంటివి ధరించడం కూడా మంచిది.
అలాగే ఇంటి పరిసరాలలో ఎలాంటి గడ్డి, చెత్త ఉండకుండా చూసుకోవాలి.
చిన్నపిల్లలను బయటికి పంపించేటప్పుడు చేతులు కాళ్లను కప్పి ఉండే దుస్తులను ధరించడం మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి