సహస్రకవచుడు నరనారాయణుల నుంచి తనను కాపాడమని సూర్యభగవానుడిని వేడుకుంటాడు.అప్పుడు సూర్యభగవానుడు.." కలకాలం నీకు అభయం ఇవ్వలేను.. నరనారాయణుల అనంతరం నీకు నా నుంచి విడుదల కలిగిస్తాను" అని చెప్తాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండి పోయాడు. ఇక కుంతి మంత్ర బలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు, ఆ సహస్రకవచుడిని చంటి బిడ్డగా మార్చి కుంతిదేవి చేతికి అందించాడు. ఇక అందుకే కర్ణుడు సహస్ర కుండలాలతో జన్మించాడు. ఇక ఆ ఒక్క సహస్ర కవచాన్ని కూడా వధించడానికి నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి , చివరికి మహాభారత యుద్ధంలో కర్ణుడిని అంతం చేస్తారు.