దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఇక్క‌డ పార్టీ పెట్టి తిరుగులేని నేత అయ్యారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా మూడుసార్లు గెల‌వ‌డంతో పాటు జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో సైతం చ‌క్రం తిప్పిన నేత‌గా ఎదిగారు. ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్న‌ప్పుడు ఎవ్వ‌రు వెళ్లినా కూడా డ‌బ్బు విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు చెప్పేవార‌ట‌ట‌. అటు ముర‌ళీ మోహ‌న్‌కు, శోభ‌న్ బాబుకు కూడా మీరు సంపాదించిన డ‌బ్బును డ‌బ్బుగా ఉంచితే ఎప్ప‌ట‌కీ ఉండ‌దు. ఆ డ‌బ్బు భూమి మీద పెట్టండి.. ఆ భూమి ఎప్ప‌ట‌కి మ‌న‌ల‌ను కాపాడుతుంది.. దానికి తిరుగులేని విలువ ఉంటుంద‌ని చెప్పేవార‌ట‌.

 

అలాగే డ‌బ్బు సంపాదించ‌డ‌మే కాదు.. దానిని ఎలా జాగ్ర‌త్త ప‌రుచుకోవాలా ? అన్న విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రికి సూచ‌న‌లు చేసేవార‌ట‌. ఎన్టీఆర్ చెప్పిన మాట‌ను అక్ష‌రాలా.. తూచా త‌ప్ప‌కుండా పాటించిన ముర‌ళీ మోమ‌న్‌, శోభ‌న్ బాబు తాము సంపాదించిన ప్ర‌తి రూపాయిని భూమి మీద పెట్టారు. వీరిద్ద‌రు అప్ప‌ట్లో త‌క్కువ రేట్ల‌కు కొన్న వంద‌లాది ఎక‌రాల విలువ ఈ రోజు కోట్ల‌లో ఉంది. శోభ‌న్ బాబు త‌న సంపాదన అంతా చెన్నై రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్ట‌డంతో ఇప్పుడు వాటి విలువ కోట్ల‌లోనే ఉంది. శోభ‌న్ బాబు త‌ర్వాత ఆయ‌న కుమారులు సినిమాల్లోకి రాలేదు.. ఇక ఇప్పుడు వారి ఆస్తుల విలువ కోట్ల‌లోనే ఉంది.

 

అలా ఎన్టీఆర్ మాట‌లు విన్న శోభ‌న్ బాబు చెన్నై రియ‌ల్ ఎస్టేట్‌లో, ఇటు మురళీ మోహ‌న్ హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌లో భారీగా పెట్ట‌బుడులు పెట్టి కోట్ల‌కు అధిపుతులు అయ్యారు. ఇక చివ‌ర‌కు శోభ‌న్ బాబు చెన్నైలోనే సెటిల్ అయ్యి అక్క‌డే మ‌ర‌ణించారు. ముర‌ళీ మోహ‌న్ హైద‌రాబాద్‌లో సెటిల్ అయ్యారు. ఏదేమైనా ఈ విష‌యం కేవ‌లం ముర‌ళీ మోహ‌న్‌కో, శోభ‌న్ బాబుకో కాదు.. ఎవ‌రైనా డ‌బ్బు సంపాదిస్తే కాదు దానిని జాగ్ర‌త్త ప‌ర‌చుకుని ఏదైనా ఆస్తి ప‌ల‌ప‌ర‌చుకున్న‌ప్పుడే దానికి విలువ ఉంటుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: