ఇప్పటికే 40 ఏళ్లు నిండిన మహేంద్రసింగ్ ధోని క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం చెన్నై జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది జరిగిన పరిణామాలు చూస్తే ధోని వచ్చే సీజన్లో ఆడతాడ లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.  ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభమైన నుంచి చెన్నై జట్టును ముందుకు నడిపిన ధోని.. ఈ ఏడాది మొదట్లో కెప్టెన్సీ నుంచి తప్పుకుని జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు.


 ఈ క్రమంలో ధోని వారసుడిగా పేరు సంపాదించుకున్న జడేజా జట్టును ముందుకు నడిపిస్తాడని అనుకుంటే  విఫలం అయ్యాడు. దీంతో ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ పేలవా ప్రస్థానాన్ని కొనసాగించి. అయితే ఆ తర్వాత కెప్టెన్సి నుంచి తప్పుకొని ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలోనే ఇక వచ్చే ఏడాది ధోని ఆడతాడా లేదా అనే అనుమానాలకు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో చెన్నై జట్టుకి ధోని తర్వాత ఎవరు కెప్టెన్ అవుతారు అంశం కూడా తెర మీదికి వస్తుంది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా రుతురాజ్  పేరును ప్రతిపాదించాడు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. రుతురాజ్ లో ధోని  లక్షణాలు పుష్కలం గా ఉన్నాయి అని నా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే రుతురాజ్  లో ఉన్నటువంటి లక్షణాలు చెన్నై సూపర్ కింగ్స్ పూర్వ వైభవం సాగించేందుకూ తోడ్పడుతాయి. ధోనీ తరహా లో రుతురాజ్ కూడా ఎంతో కూల్ గా కనిపిస్తాడని సెంచరీ చేసిన డకౌట్ అయినా ఒక రకంగా స్పందిస్తాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా రుతురాజ్ కు మహారాష్ట్ర కెప్టెన్ గా చేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి అతనికి చెన్నై జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl