ఇటీవల కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో తెరమీదకి వస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ తామే అన్న విషయాన్ని తమ ఆట తీరుతో నిరూపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా గత ఏడాది ఐపిఎల్ లో మంచి ప్రదర్శన చేసి టీమిండియాలో దక్కించుకున్న యువ ఆటగాళ్లలో అటు అర్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఇక అర్షదీప్ కూడా అందరిలాంటిఆటగాడు అని అనుకున్నారు. కేవలం వచ్చిన కొన్ని రోజులు మాత్రమే మెరుపులు మెరిపించి తర్వాత కనుమరుగు  అవుతాడు అని భావించారు. కానీ ఊహించని రీతిలో అర్షదీప్ ఏకంగా భారత జట్టులో కీలక బౌలర్గా ఎదుగుతూ ఉన్నాడు.


 అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ ఏకంగా స్టార్ బ్యాట్స్మెన్ లను సైతం తన బౌలింగ్ తో వికెట్లు పడగొడుతూ అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో కూడా అర్షదీప్ లో ఎక్కడ ఒత్తిడి కనిపించలేదు. ఎంతో స్వేచ్ఛగా బౌలింగ్ చేస్తూ పరుగులను కట్టడం చేయడమే కాదు.. వికెట్లను పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక సెమి ఫైనల్ మ్యాచ్లో మినహా మిగతా అన్ని మ్యాచ్లో కూడా అర్షదీప్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల అర్షదీప్ ఇతర ఆటగాళ్లతో పోలిస్తూ ఉన్నారు కొంత మంది మాజీ ఆటగాళ్ళు. ఇదే విషయంపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ స్పందించాడు. భారత్ యువ ఫేసర్ అర్షదీప్ కఠినమైన మైదానాల్లోనూ అదరగొడతానని అభిప్రాయపడ్డాడు. అయితే బంతులు అన్నివైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం అతని సొంతం అంటూ ప్రశంసించాడు. పవర్ ప్లే లో రాణిస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే పాక్ మాజీ స్వింగ్ బౌలర్ వసీం అక్రమ్ తో హర్షదీప్ ను పోల్చి ఇక అతనిపై ఒత్తిడి పెంచవద్దు అంటూ సూచించాడు. ఇక న్యూజిలాండ్ లో జరగబోయే టి20, వన్డే సిరీస్ లు యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: