ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు ఇక నేటి నుంచి అటు ఆతిధ్య బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఆడింది టీం ఇండియా. అద్భుతంగా రానిస్తుంది అనుకున్నప్పటికీ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి చివరికి వన్డే సిరీస్ ను చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ఇక మూడో వన్డే మ్యాచ్లో మాత్రం ఘన విజయాన్ని అందుకుని చివరికి తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది టీమిండియా.


 ఇక నేటి నుంచి ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరులో నిలవాలంటే ఈ టెస్ట్ సిరీస్ అటు టీమ్ ఇండియాకు ఎంతో కీలకంగా కాబోతుంది అని చెప్పాలి. వన్డే సిరీస్ లో ఓడిపోయినప్పటికీ అటు టెస్ట్ సిరీస్లో టీమిండియా బంగ్లాదేశ్ ను రెండు సున్నా తేడాతో ఓడిస్తేనే అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరులో నిలుస్తుంది అని చెప్పాలి. లేదంటే పోరు నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక ఇటీవలే రోహిత్ శర్మ గాయపడటంతో ఇక వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు.


 ఇదిలా ఉంటే ఎన్నో ఏళ్ల తర్వాత వెటరన్ బౌలర్ జయదేవ్ ఉనద్గత్  ఇటీవల టీం ఇండియాలో అవకాశం వచ్చింది. దీంతో అభిమానులు ఎంతో సంబరపడిపోయారు. అయితే ఇదే విషయంపై టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ స్పందించాడు. దేశ వాలి మ్యాచ్లలో అద్భుతంగా రాణించిన జయదేవ్ ఉనద్గత్ మళ్ళీ ఆహ్వానం రావడం అద్భుతం. అయితే తుది జట్టులోకి రావడం మాత్రం కష్టమే అంటూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే శార్దూల్ ఠాగూర్,ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజులు ఉన్నారు. అతను తుదిజట్టులో లేకపోయినా జట్టుతో ఉండడం మాత్రం ఎప్పటికైనా కలిసి వస్తుంది అంటూ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: