టీ 20 వరల్డ్ కప్ లో నిరాశాజనకమైన ప్రదర్శన చేసిన టీం ఇండియా ప్రస్తుతం నెమ్మదిగా గదిలో పడుతూ ఉంది అని చెప్పాలి. న్యూజిలాండ్ గడ్డపై పర్వాలేదు అనిపించినా , బంగ్లాదేశ్ పై వన్ డే సిరీస్ ను కోల్పోయినా , స్వదేశంలో మొన్ననే ముగిసిన శ్రీలంక సిరీస్ లో వన్ డే లు మరియు టీ 20 లలో చెలరేగి ఆడి అద్భుత విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు సాధించడం అభిమానులకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ సైతం విలువైన పరుగులు చేసి టచ్ లోకి వచ్చాడు. కాగా ఈ రోజు నుండి ఫిబ్రవరి 1 వరకు మూడు వన్ డే లు మరియు మూడు టీ 20 లను న్యూజిలాండ్ తో ఆడనుంది.

అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లోని ఉప్పల స్టేడియంలో తెలుగు అభిమానుల ముంగిట మొదటి వన్ డే లు ఇరు జట్లు పోరాడనున్నాయి. ప్రస్తుతం కివీస్ జట్టు వన్ డే లలో మొదటి స్థానంలో ఉంది. ఈ జట్టుకు కెప్టెన్ గా యువ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మన్ టామ్ లాతమ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఆసియా పిచ్ లపై ఆడి సిరీస్ ను దక్కించుకోవడం అంత ఈజీ కాదు అని తెలిసిందే. అయితే కుర్రాళ్లతో నిండిన కివీస్ జట్టును తక్కువ అంచనా వేయలేము. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం లాంటిది అని చెప్పాలి. టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.

ఈ రోజు మ్యాచ్ లో కివీస్ నుండి లాతమ్ , కాన్ వే, ఫిలిప్స్ లు కీలకం కానున్నారు. వీరికి క్రీజులో కుదురుకుని ఛాన్స్ ఇస్తే భారీ ఇన్నింగ్స్ లు ఆడి మ్యాచ్ ను తమవైపుకు లాగేసుకుంటారు. అందుకు వీరిని వీలైనంత తొందరగా అవుట్ చేస్తే గెలుపు మనకు దగ్గరవుతుంది. ఇక ఇండియాలో శుబ్మాన్ గిల్ , రోహిత్ శర్మ మరియు విరాట్ లు మరోసారి రాణిస్తే గెలవడం అంత కష్టం కాదు. మరి చూద్దాం ఈ మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందో ?    


 

మరింత సమాచారం తెలుసుకోండి: